Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK vs SRH: రెండు మార్పులతో బరిలోకి సీఎస్కే - సన్‌రైజర్స్‌కు సవాల్!

CSK vs SRH: పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య చెపాక్‌ వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఈ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తలపడుతున్నాయి. ఇప్పటివరకు సీఎస్కే, హైదరాబాద్‌ ఎనిమిది మ్యాచులు ఆడగా.. చెరో రెండు విజయాలు మాత్రమే సాధించాయి. అయితే ఇప్పుడు జరుగుతోన్న మ్యాచులో ముందుగా టాస్ గెలిచిన సన్‌రైజర్స్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో సీఎస్కే బ్యాటింగ్ కు దిగింది. అయితే జట్టులో రెండు మార్పులతో బరిలోకి దిగింది సీఎస్కే. డెవాల్డ్ బ్రెవిస్ సీఎస్కే తరఫున అరంగేట్రం చేశాడు.

"మేము బౌలింగ్ ఎంచుకోవడానికి ప్రధాన కారణం డ్యూ. అన్ని విభాగాల్లో మంచి క్రికెట్ ఆడకపోతే, ఇతర ఆటగాళ్లపై కూడా ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మేము సరైన ప్రక్రియను అనుసరించాలనుకుంటున్నాం. మిగతా మ్యాచ్‌ల్లో అదే లక్ష్యంగా పెట్టుకుంటున్నాం. ఒక్కో మ్యాచ్‌ను ఒక్కోలా చూడాలని అనుకుంటున్నాం. కొన్ని కాంబినేషన్లను పరిశీలిస్తున్నాం. ఆటగాళ్లకు తమపై నమ్మకం ఉండాలి. వారు తమకు ఇచ్చిన బాధ్యతను, ప్లాన్ ను అమలు చేయగలగాలి."

"ఈ పిచ్ ఎలా ఉంటుందో మాత్రం కచ్చితంగా తెలీదు. గ్రౌండ్‌స్టాఫ్ తమ స్థాయిలో చాలా కష్టపడుతున్నారు. 2010 ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాత రెడ్ సిల్ పిచ్ చాలా బాగుండేది. మేము ఈ మ్యాచ్‌ కోసం రెండు మార్పులు చేశాం. రచిన్, శంకర్ ఆడట్లేదు. వారి స్థానాల్లో బ్రెవిస్, హుడా జట్టులోకి వచ్చారు." అని ధోనీ చెప్పుకొచ్చాడు.

CSK vs SRH Sunrisers Hyderabad have won the toss and have opted to field against chennai super kings

CSK Vs SRH: తుది జట్టు ఇదే..
చెన్నై సూపర్ కింగ్స్: షేక్ రషీద్, ఆయూష్ మాత్రే, శామ్ కరన్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్, కెప్టెన్), దీపక్ హుడా, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, పతిరన

సన్ రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, కమిందు మెండిస్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, జీషాన్ అన్సారీ, మహ్మద్ షమి

400వ టీ20 మ్యాచ్
సీఎస్కే కెప్టెన్ ధోనీకి ఇది 400వ టీ20 మ్యాచ్ కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఈ మార్క్ టచ్ చేసిన 24వ ఆటగాడు కాగా.. భారత్ నుంచి నాలుగో ప్లేయర్ గా ఈ ఘనత సాధించాడు. ధోనీ కన్నా ముందు రోహిత్ శర్మ (456), దినేశ్ కార్తిక్ (412), విరాట్ కోహ్లి (408) మాత్రమే ఈ ఫీట్ అందుకున్నారు. కాగా, ధోనీ ఇప్పటివరకు 399 మ్యాచులు ఆడి 7,566 పరుగులు చేశాడు. ఇందులో 28 అర్ధ శతకాలు ఉన్నాయి.

Story first published: Friday, April 25, 2025, 19:19 [IST]
Other articles published on Apr 25, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+