For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు 'స్టార్ల' మద్దతు

IPL 2019 : Sania Mirza And Other Celebrities In Support To SRH Team In Uppal Stadium || Oneindia
CSK vs SRH: Sania Mirza, Sumanth, Sushanth Cheering for SRH

ఐపీఎల్‌ మ్యాచ్‌లు అంటేనే వినోదం. ఈ వినోదాన్ని చిన్నా, పెద్దా, స్టార్లు అనే తేడా లేకుండా ఎంజాయ్ చేస్తారు. ఇక ప్రాంచైజీ సొంత గడ్డపై మ్యాచ్‌ అంటే పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చి మద్దతిస్తారు. అభిమానులతో పాటు లోకల్ సెలెబ్రిటీలు కూడా మ్యాచ్ చూడటానికి వచ్చి తమ మద్దతును తెలుపుతారు.

సానియా సందడి:

బుధవారం రాత్రి ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సెలెబ్రిటీలు సన్‌రైజర్స్‌కు మద్దతిచ్చారు. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఉప్పల్ మైదానంకు వచ్చి సన్‌రైజర్స్‌కు మద్దతిచ్చింది. సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు బౌండరీలు బాదినప్పుడల్లా అభిమానులతో కలిసి సందడి చేసింది. అంతేకాదు ఆరెంజ్ ఆర్మీకి మద్దతివ్వండని కోరింది. కుమారుడికి జన్మనివ్వడంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న సానియా బుధవారం సన్‌రైజర్స్‌ మ్యాచ్ వీక్షించింది.

అభిమానులతో కిక్కిరిసిపోయిన మైదానం:

అభిమానులతో కిక్కిరిసిపోయిన మైదానం:

సొంతగడ్డపై జరుగుతోన్న మ్యాచ్‌ కావడంతో సినీ నటులు సుమంత్, సుశాంత్‌లు కూడా మ్యాచ్‌కు హాజరయి సందడి చేశారు. స్థానిక ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌ను చూడటానికి హైదరాబాద్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మ్యాచ్‌ కోసం టికెట్లన్నీ ఎప్పుడో అమ్ముడవడంతో.. మైదానం మొత్తం ప్రేక్షకులతో కళకళలాడింది. సన్‌రైజర్స్, చెన్నై మద్దతుదారులతో స్టేడియం మొత్తం ఆరెంజ్, పసుపు జెండాలతో నిండిపోయింది. అభిమానుల అరుపులతో ఉప్పల్ మైదానం మొత్తం మోత మోగింది.

సన్‌ స్ట్రోక్:

సన్‌ స్ట్రోక్:

ఉప్పల్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌పై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 6 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. డుప్లెసిస్‌ (31 బంతుల్లో 45; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), వాట్సన్‌ (29 బంతుల్లో 31; 4 ఫోర్లు)లు రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌ 16.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసి విజయం సాధించింది. వార్నర్‌ (25 బంతుల్లో 50; 10 ఫోర్లు), బెయిర్‌స్టో (44 బంతుల్లో 61 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు.

Story first published: Thursday, April 18, 2019, 12:39 [IST]
Other articles published on Apr 18, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+