Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK VS SRH: ఆ నలుగురు నాకు చాలా భయం - ప్యాట్ కమిన్స్

Sunrisers Hyderabad: వచ్చామా.. బాదామా.. వెళ్లామా.. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ వ్యూహం ఇదే. అదే ఆ జట్టును గతేడాది ఐపీఎల్‌ ఫైనల్‌కు చేర్చింది. కానీ ఈ సారి అంచనాలు తారుమరయ్యాయి. ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అంచనాలను అందుకోలేకపోతోంది. 200 స్కోరు కూడా కొట్టలేక కష్టపడుతోంది. పేలవ ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ అవకాశాలను కూడా సంక్లిష్టం చేసుకుంది. ఇంకా చెప్పాలంటే అత్యుత్తమం నుంచి అథఃపాతాళానికి పడిపోతోంది. ఈ నేపథ్యంలో ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ జట్టు అగ్రిస్సివ్ క్రికెట్ గురించి మాట్లాడాడు. ఆటగాళ్ల గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.

అతడి సిక్సులు అద్భుతం..
"మా జట్టులో అనికేత్ వర్మ అద్భుతం. ట్రైనింగ్, వార్మప్ మ్యాచుల్లో మమ్మల్ని బాగా ఇంప్రెస్ చేశాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సిక్సులను వేగంగా బాదగలడు. స్పిన్నర్లపై అయితే విరుచుకుపడతాడు. అతడు ఆడే షాట్లు అద్భుతంగా ఉంటాయి." జట్టులోని యంగ్ స్టర్స్‌తో కలిసి ఆడుతోన్న అనుభవం గురించి మాట్లాడుతూ.. "ముందుగా వాళ్లను నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. వాళ్లు ఏఏ పరిస్థితుల్లో ఎలాంటి ప్రదర్శన చేయగలరో గమనిస్తాను. అనికేత్ వర్మ, ఇషాన్ కిషన్ అటాకింగ్ స్టైల్ ఆడతారు. మ్యాచును కంట్రోల్ చేస్తారు."

ఆ నలుగురు నెక్ట్స్ లెవెల్..
"మా జట్టులోని చాలా వరకు ఆటగాళ్లు అటాకింగ్ క్రికెట్ ఆడతారు. తొలి మ్యాచులో 280 స్కోరు చేశారు. అది అనుకోకుండా వచ్చింది కాదు. క్యాల్కులేటెడ్ గా ఆడింది. మా జట్టులో అటాకింగ్ బ్యాటింగ్ ఆర్డర్ ఉండడంతో, షాట్లు బాగా ఆడతాం. మా ప్లేయర్లు 200 స్ట్రైక్ రేటుతో ఆడాలి. వాళ్లను మేం ఎప్పుడు ప్రోత్సాహిస్తాం. అయితే ప్రస్తుతం మా బ్యాటింగ్ లైనప్ లో ఉన్న ఒకరు లేదా ఇద్దరు అద్భుతంగా రాణిస్తే చాలు.. మేం విజయం సాధిస్తాం. అలాంటి బ్యాటింగ్ లైనప్ ను ఎదుర్కొనేందుకు నేను కూడా భయపడతాను. ఎందుకంటే మా వాళ్లలో ఒక్క బ్యాటర్ ఫామ్ లో వచ్చాడంతో 30 బంతుల్లోనే 100 స్కోరు చేయగలిగే సామర్థ్యం ఉంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్, క్లాసెన్ వీళ్లంతా.. టీ20లో బ్యాటింగ్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లారు."

బ్యాటింగే కాదు బౌలింగ్ కూడా...
"అందరూ గతేడాది మా బ్యాటింగ్ లైనప్ గురించి మాట్లాడారు. కానీ మా బౌలింగ్ యూనిట్ లోనూ ఎంతో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు. ఓ కెప్టెన్ గా వాళ్లు జట్టుకు ఎంత ముఖ్యమో నాకు తెలుసు. నటరాజన్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్ వంటి ఆటగాళ్లు ఉన్నారు." అని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.

csk vs srh pat cummins says Scared to play against Travis head nitish reddy klassen Abhishek sharma
Story first published: Friday, April 25, 2025, 18:33 [IST]
Other articles published on Apr 25, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+