Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK VS SRH: కళ్లు బైర్లు కమ్మే క్యాచ్.. మళ్లీ మళ్లీ చూడాలనిపించే క్యాచ్! (వీడియో)

Kamindu Mendis: ఐపీఎల్ 2025లో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతోన్న మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరబాద్ మ్యాచులో అసాధారణ క్యాచ్ నమోదైంది (Best catch of IPL 2025). ఈ మ్యాచుతో సీఎస్కే తరఫున అరంగేట్రం చేసిన విధ్వంసకర బ్యాటర్ బ్రెవిస్ బాదిన బంతిని.. సన్ రైజర్స్ ఆటగాడు కమిందు మెండీస్ అద్భుతంగా క్యాచ్ పట్టాడు. అన్‌బిలీవబుల్ ఎక్స్‌ట్రార్డినరీ క్యాచ్ ను పట్టుకుని ప్రేక్షకుల చేత ఔరా అనిపించాడు. దీంతో హర్షల్ పటేల్ బౌలింగ్ లో 12.5 ఓవర్ దగ్గర కమిందు మెండీస్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు బ్రెవిస్.

సూపర్ మ్యాన్ లా గాల్లోకి ఎగిరి మరీ(CSK VS SRH)..
12.5 ఓవర్ దగ్గర హర్షల్ పటేల్.. ఆఫ్ స్టంప్ ఔట్ సైడ్ మీదుగా హఫ్ వోలీ బౌలింగ్ చేశాడు. దీంతో బ్రెవిస్ లాంగ్ ఆఫ్ మీదుగా బాదాడు. అప్పుడు బంతి బౌండరీని తాకబోయింది. కానీ అక్కడే ఉన్న కమిందు మెండీస్ అద్భుతమైన రీతిలో ఫుల్ లెంగ్త్ డైవింగ్ చేసి మరీ క్యాచును అందుకున్నాడు. తన లైఫ్ సైడ్ వైపునకు వస్తోన్న బంతిని చూసి.. పరుగెత్తుకుంటూ వచ్చి గాల్లోకి పక్షిలా ఎగిరి మరీ రెండు చేతులతో గాల్లోనే క్యాచ్ అందుకున్నాడు. దీంతో 114 పరుగులు వద్ద ఐదో వికెట్ కోల్పోయింది చెన్నై సూపర్ కింగ్స్. ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు జరిగిన మ్యాచుల్లో ఈ క్యాచ్ స్పెషల్ హైలైట్ గా నిలిచింది.

CSK VS SRH kamindu mendis unbelievable catch to dismiss dewald brevis in ipl 2025

ఈ మ్యాచులో 19.5 ఓవర్లకు చెన్నై సూపర్ కింగ్స్ 154 పరుగులకు ఆలౌటైంది. సన్ రైజర్్ హైదరాబాద్ ముందు 155 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. చైన్నై బ్యాటర్లవో బ్రేవిస్ (42), ఆయుశ్ మాత్రే (30) రాణించారు. దీపక్ హుడా (22), రవీంద్ర జడేజా (21) ఫర్వాలేదనిపించారు. షేక్ రషీద్ (0), శ్యామ్ కరన్ (9), ధోనీ (6) విఫలమయ్యారు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ లో హర్షల్ పటేల్ 4 వికెట్లతో చెలరేగాడు. ప్యాట్ కమిన్స్ 2, జయదేవ్ ఉనద్కత్ 2, మహ్మద్ షమి 1, కమిందు మెండిస్ 1 వికెట్ దక్కించుకున్నారు.

Story first published: Friday, April 25, 2025, 21:09 [IST]
Other articles published on Apr 25, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+