Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK VS SRH: ధోనీ.. మూగబోయిన చెపాక్ స్టేడియం

CSK VS SRH: చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ త‌న కెరీర్‌లో 400వ టీ20 మ్యాచ్ మైలు రాయిని అందుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌-2025లో చెపాక్ స్టేడియం వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ధోని ఈ ఘ‌న‌త సాధించాడు. ఈ మార్క్ అందుకున్న నాలుగో భారత క్రికెటర్‌గా ధోనీ రికార్డుకెక్కాడు. అయితే ఈ మ్యాచులో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ధోనీ దెబ్బకు.. చెపాక్ స్టేడియం మూగబోయింది.

ఆయుశ్ మాత్రే మెరుపులు..
ఈ మ్యాచులో మొదట బౌలింగ్ చేసిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్.. సీఎస్కేను తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. హ‌ర్ష‌ల్ ప‌టేల్ 4 వికెట్ల‌తో చెలరేగగా.. 19.5 ఓవ‌ర్ల‌లోనే చెన్నై ఆలౌట‌్ అయిపోయింది. మొదట ఇన్నింగ్స్ ఆడిన సీఎస్కేకు ఆదిలోనే మ‌హ్మ‌ద్ ష‌మీ గట్టి షాకిచ్చాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెన‌ర్ షేక్ ర‌షీద్(0)ను ఔట్ చేసి సీఎస్కేను గట్టి దెబ్బ కొట్టాడు. ర‌షీద్.. అభిషేక్ శ‌ర్మ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. 17 ఏళ్ల‌ ఆయుశ్ మాత్రే(19 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 30 పరుగులు) మాత్రం కాసేపు ధాటిగా ఆడాడు. కానీ క‌మిన్స్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడ‌బోయి.. ఔటయ్యాడు.

CSK VS SRH IPL 2025 MS Dhoni fails scores only 6 runs in his 400th T20 match

ధోనీ నిరాశపరిచినా.. ఆఖర్లో హుడా మెరుపులు..
ఆ తర్వాత సీఎస్కేను డెవాల్డ్ బ్రెవిస్ (42), ర‌వీంద్ర జ‌డేజా(21)లు ఆదుకున్నారు. కానీ హ‌ర్ష‌ల్ ప‌టేల్(4/28) సీఎస్కే మిడిలార్డ‌ర్‌ను గట్టిగా దెబ్బకొట్టాడు. శివం దూబే(12) నిరాశపరిచాడు. అనంతరం హ‌ర్ష‌ల్ విజృంభించడంతో ధోనీ(6), నూర్ అహ్మ‌ద్‌(2)లు కూడా పెవిలియ‌న్ చేరారు. ముఖ్యంగా ధోనీ క్రీజులో రాగానే అభిమానుల్లో జోష్ పెరిగిపోయింది. కానీ అతడు 16.3 ఓవర్ దగ్గర అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో చెపాక్ స్టేడియం ఒక్కసారిగా మూగబోయింది. అభిమానులు తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయారు. ఆఖ‌ర్లో దీప్ హుడా(22) బ్యాటును కాసేపు ఝుళిపించ‌డంతో చెన్నై స్కోర్ 150 దాటగలిగింది.

Story first published: Friday, April 25, 2025, 21:59 [IST]
Other articles published on Apr 25, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+