Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK vs SRH: గ‌తేడాది ఆరెంజ్‌క్యాప్ విన్న‌ర్.. ఈ సారెమో ఫెయిల్‌.. రుతురాజ్ గైక్వాడ్ అట్ట‌ర్ ఫ్లాప్

CSK vs SRH: IPL 2021 orange cap winner Ruturaj Gaikwad Failure in IPL 2022

ఐపీఎల్ 2022లో చెన్నైసూప‌ర్ కింగ్స్ ఓపెన‌ర్ రుతురాజ్ గైక్వాడ్ ఫేల‌వ ప్ర‌ద‌ర్శ‌న కొనసాగుతుంది. గతేడాది ఆరెంజ్ క్యాప్ విజేత‌గా నిలిచిన గైక్వాడ్ ఈ సీజ‌న్‌లో మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన మ్యాచ్‌ల్లో దారుణంగా విఫ‌ల‌మ‌య్యాడు. క‌నీస ప్ర‌ద‌ర్శ‌న కూడా ఇవ్వ‌లేక‌పోతున్నాడు. ఈ సీజ‌న్లో ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 18 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. ఈ సీజ‌న్లో ఆడిన‌ మొద‌టి మ్యాచ్‌లో డ‌కౌట్ అయిన రుతురాజ్ గైక్వాడ్.. రెండో మ్యాచ్‌లో ఒక ప‌రుగు, రెండో మ్యాచ్‌లో ఒక్క ప‌రుగు మాత్ర‌మే చేశాడు. తాజాగా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో మ్యాచ్‌లోనూ 16 ప‌రుగుల‌కే ఔటై తీవ్రంగా నిరాశ‌ప‌రిచాడు.

గ‌తేడాది 635 ప‌రుగుల‌తో చెన్నైసూప‌ర్ కింగ్స్ ట్రోఫి గెల‌వ‌డంలో రుతురాజ్ గైక్వాడ్ కీల‌క పాత్ర పోషించాడు. ఈ క్ర‌మంలో టోర్నీలో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన ఆట‌గాడిగా నిలిచి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 26 మ్యాచ్‌లు ఆడిన రుతురాజ్ గైక్వాడ్ 38 స‌గటుతో 857 ప‌రుగులు చేశాడు. ఇందులో 7 హాఫ్ సెంచ‌రీలు, ఒక సెంచ‌రీ ఉన్నాయి.

CSK vs SRH: IPL 2021 orange cap winner Ruturaj Gaikwad Failure in IPL 2022

ఇక ఈ మ్యాచ్ విష‌యానికొస్తే స‌న్‌రైజ‌ర్స్ ముందు చెన్నైసూప‌ర్ కింగ్స్ 155 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఉంచింది. చెన్నైసూప‌ర్ కింగ్స్ 7 వికెట్ల న‌ష్టానికి 154 ప‌రుగులు చేసింది, మొయిన్ అలీ 48, అంబ‌టి రాయుడు 27, ర‌వీంద్ర జ‌డేజా 23, రుతురాజ్ గైక్వాడ్ 16, రాబిన్ ఊత‌ప్ప 15, డ్వేన్ బ్రావో 8, జోర్దాన్ 6, ధోని 3, శివ‌మ్ దూబే 3 ప‌రుగులు చేశారు. స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్ల‌లో వాషింగ్ట‌న్ సుంద‌ర్, టి. న‌ట‌రాజ‌న్ రెండేసి, భువ‌నేశ్వ‌ర్ కుమార్, మార్కో జెనీస‌న్, ఎయిడెన్ మాక్ర‌మ్ త‌లో వికెట్ తీశారు.

తుది జ‌ట్లు
చెన్నై సూపర్ కింగ్స్: రాబిన్ ఉతప్ప, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా(కెప్టెన్), శివమ్ దూబే, ఎంఎస్ ధోని (వికెట్ కీప‌ర్), డ్వేన్ బ్రావో, క్రిస్ జోర్డాన్, మహేశ్ తీక్షణ, ముఖేష్ చౌదరి

సన్‌రైజర్స్ హైదరాబాద్): అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్, నికోలస్ పూరన్ (వికెట్ కీప‌ర్), శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్

Story first published: Saturday, April 9, 2022, 17:40 [IST]
Other articles published on Apr 9, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+