For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మా ఓటమికి కారణం అదే- కమిన్స్

200 పరుగులు చేయడం చాలా సులువు, 250+ పరుగులు చేయడం కూడా కష్టతరం కాదని నిరూపించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా డీలాపడింది. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్ 134 పరుగులకే ఆలౌటైంది. హోరాహోరీగా ఛేదన సాగుతుందనకుంటే కనీస పోరాట పటిమ కూడా చూపించలేకపోయింది.

మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (98; 54 బంతుల్లో, 10x4, 3x6) తృటిలో శతకాన్ని కోల్పోయాడు. డారిల్ మిచెల్ (52; 32 బంతుల్లో, 7x4, 1x6), శివమ్ దూబె (39*; 20 బంతుల్లో, 1x4, 4x6) కీలక ఇన్నింగ్స్ ఆడారు.

CSK vs SRH A Few Games Lost but Quick Bounce Back on the Cards - Pat Cummins

అనంతరం ఛేదనలో సన్‌రైజర్స్ 18.5 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలి 78 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. మార్క్‌రమ్ (32; 26 బంతుల్లో, 4x4) టాప్ స్కోరర్. సీఎస్కే బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే (4/27) నాలుగు వికెట్లు, ముస్తాఫిజుర్ (2/19), పతిరనా (2/17) చెరో రెండు వికెట్లు తీశారు.

కాగా, మ్యాచ్ అనంతరం ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఓటమికి గల కారణాలు వివరించాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంపై స్పందిస్తూ.. మొదట ఫీల్టింగ్ ఎంచుకోవడం ఓటమికి కారణం కాదని పేర్కొన్నాడు. ఛేజింగ్ చేస్తామని భావించే ఆ నిర్ణయం తీసుకున్నామని, కానీ దురదృష్టవశాత్తు పరాజయాన్ని చవిచూశామని కమిన్స్ అన్నాడు.

''విజయం సాధించడానికి ఛేదన ఉత్తమ మార్గంగా భావించాం. కానీ దురదృష్టవశాత్తు మంచి ఫలితం రాలేదు. వాళ్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వికెట్ సహకరించింది. మాకు అదే పరిస్థితి ఉంటుదని అనుకున్నాం. ఇక మా బ్యాటింగ్ లైనప్ గురించి సంతోషంగానే ఉన్నాం. ఇవాళ మాత్రమే మేం గెలవలేకపోయాం. ఈ సీజన్‌లో ఇలాంటి ఎన్నో మ్యాచ్‌లను మా బ్యాటింగ్ లైనప్‌‌లోని ఆటగాళ్లే గెలిపించారు. సీఎస్కే ఇన్నింగ్స్‌లో కూడా మంచు ప్రభావం చూపించింది. ఇది కేవలం రెండు వరుస పరాజయాలు. తిరిగి త్వరగా పుంజుకుంటాం'' అని కమిన్స్ అన్నాడు.

Story first published: Monday, April 29, 2024, 7:37 [IST]
Other articles published on Apr 29, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+