Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK vs RR: సిక్సులతో శాంసన్ వీరవిహారం.. 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!!

CSK vs RR: Sanju Samson dealing with sixes only, completes fifty off 19 balls
IPL 2020, CSK vs RR : Sanju Samson Show With 19-ball 50, Hits 9 Sixes || Oneindia Telugu

షార్జా: ఐపీఎల్‌ 13వ సీజన్‌లో భాగంగా షార్జా వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుతో జరుగుతున్న మ్యాచులో రాజస్థాన్‌ రాయల్స్‌ యువ బ్యాట్స్‌మన్‌ సంజూ శాంసన్ వీరవిహారం చేశాడు. సిక్సులే లక్ష్యంగా ఆడాడు. చెన్నై పేస్, స్పిన్ బౌలర్లపై విరుచుపడి ఏకంగా 9 సిక్సులు బాదాడు. దీంతో 19 బంతుల్లోనే శాంసన్ హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. శాంసన్ జోరుతో రాజస్థాన్‌ 8 ఓవర్లు ముగిసేసరికి 96 పరుగులు చేసింది. ఇక ఇన్నింగ్స్ ఆరంభం నుంచి శాంసన్‌ను ఔట్ చేసేందుకు చెన్నై బౌలర్లు అష్టకష్టాలు పడ్డారు. చివరకు లుంగి ఎంగిడి బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి దీపక్ చహర్‌ చేతికి చిక్కాడు.

చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో.. రాజస్థాన్‌ బరిలోకి దిగింది. అయితే రాజస్థాన్‌ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ ‌(6) త్వరగానే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన సంజూ శాంసన్‌ ఆదినుంచి రెచ్చిపోయి ఆడాడు. సిక్సర్ల మోత మోగించి 19 బంతుల్లో 1 ఫోర్‌, 6 సిక్స్‌లతో హాఫ్‌ సెంచరీ బాదాడు. పీయూష్‌ చావ్లా వేసిన ఇన్నింగ్స్‌ ఎనిమిదో ఓవర్‌లో నాలుగు భారీ సిక్స్‌లు కొట్టాడు. దీంతో టీ20 మ్యాచ్‌లో తన బ్యాటింగ్‌ ఎలా ఉంటుందో చెన్నైకి రుచిచూపెట్టాడు.

రవీంద్ర జడేజా వేసిన 7వ ఓవర్లోనూ రెండు సిక్స్‌లు బాదాడు సంజూ శాంసన్‌. దాంతో ఎంఎస్ ధోనీ సీనియర్ స్పిన్నర్ చావ్లాను రంగంలోకి దించినా.. మరింత రెచ్చిపోయాడు. ఇక రాజస్థాన్ తరఫున ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ సాధించిన మూడో ఆటగాడిగా శాంసన్‌ నిలిచాడు. దాంతో రాజస్తాన్‌ రాయల్స్‌ స్కోరు 8 ఓవర్లలో 96 పరుగులు చేసింది. ఆపై ధనాధన్‌ బ్యాటింగ్‌తో పరుగుల వరద పారించాడు. ఆపై ఎంగిడి బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి చహర్‌ చేతికి చిక్కాడు. దీంతో 132 పరుగుల వద్ద రాజస్థాన్‌ రెండో వికెట్‌ కోల్పోయింది.

శాంసన్‌ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన హార్డ్‌హిట్టర్‌ డేవిడ్‌ మిల్లర్‌ రనౌటయ్యాడు. కనీసం ఒక్క బంతిని కూడా అతడు ఎదుర్కోలేదు. ఇక నిలకడగా ఆడిన స్టీవ్‌ స్మిత్‌ కూడా గేర్ మార్చి అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. రాబిన్ ఉతప్ప (5), రాహుల్ తేవాటియా (10) కూడా త్వరగానే పెవిలియన్ చేరారు. అయితే స్మిత్ మాత్రం తన జోరు కొనసాగిస్తున్నాడు. 16.2 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్‌ 5 వికెట్లకు 167 పరుగులు చేసింది. స్మిత్ ‌(67), పరాగ్ (0) క్రీజులో ఉన్నారు.

Story first published: Tuesday, September 22, 2020, 20:56 [IST]
Other articles published on Sep 22, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+