Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK vs RR: చెమటోడ్చిన రాజస్థాన్.. సీఎస్కే టార్గెట్ ఎంతంటే?

స్లో పిచ్‌పై రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు పరుగులు చేయడానికి చెమటోడ్చారు. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ (47*; 35 బంతుల్లో, 1x4, 3x6), ధ్రువ్ జురెల్ (28; 18 బంతుల్లో, 1x4, 2x6) రాణించారు. సీఎస్కే బౌలర్లలో సిమర్జీత్ సింగ్ (3/26) మూడు, తుషార్ దేశ్‌పాండే (2/30) రెండు వికెట్లతో సత్తాచాటారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ నిలకడగా ఇన్నింగ్స్ ఆరంభించింది. బ్యాటింగ్‌కు గొప్పగా అనుకూలించిన ఈ పిచ్‌పై ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ (24; 21 బంతుల్లో, 3x4, 1x6), బట్లర్ (21; 25 బంతుల్లో, 2x4) జాగ్రత్తగా ఆడారు. తొలుత బంతికో పరుగు చేయడానికి శ్రమించిన జైస్వాల్ క్రమంగా పుంజుకున్నాడు. తీక్షణ వేసిన నాలుగో ఓవర్‌లో సిక్సర్, బౌండరీ బాదాడు.

CSK vs RR Rajasthan Royals Challenge CSK with a 142-Run Target on a Sluggish Pitch

శార్దూల్ ఠాకూర్ వేసిన తర్వాతి ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు సాధించాడు. దీంతో రాజస్థాన్ పవర్‌ప్లేలో 42/0 స్కోరు సాధించింది. అయితే కాసేపటికే ఓపెనర్లు ఇద్దరినీ సిమర్జీత్ పెవిలియన్‌కు చేర్చి ఆర్‌ఆర్‌ను దెబ్బకొట్టాడు. తన వరుస ఓవర్లలో జైస్వాల్, బట్లర్‌ను ఔట్ చేశాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన రియాన్ పరాగ్‌తో కలిసి సంజు శాంసన్ (15; 19 బంతుల్లో) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.

పరాగ్ సంయమనంతో ఆడుతున్నప్పటికీ, శాంసన్ జాగ్రత్తగా ఆడటంతో రన్‌రేట్ క్రమంగా తగ్గింది. 14 ఓవర్లకు రాజస్థాన్ 89/2 స్కోరుతో నిలిచింది. అయితే రాజస్థాన్‌ను సిమర్జిత్ మరోసారి దెబ్బకొట్టాడు. గేర్ మార్చ్ దూకుడుగా ఆడాలనుకున్న శాంసన్‌ను బోల్తా కొట్టించాడు. ఈ మ్యాచ్‌లో శాంసన్ ఒక్క బౌండరీ కూడా సాధించకపోవడం గమనార్హం. కాగా, అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ధ్రువ్ జురెల్‌తో కలిసి రియాన్ ఆఖర్లో దూకుడుగా ఆడటంతో చెన్నైకి రాజస్థాన్ పోరాడే లక్ష్యాన్ని నిర్దేశించింది.

Story first published: Sunday, May 12, 2024, 17:17 [IST]
Other articles published on May 12, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+