CSK VS RR: 'ఛల్ ఛయ్య ఛయ్య ఛయ్య', 'మున్నీ బద్నామ్ హుయీ'... ఈ సాంగ్స్ వినగానే టక్కున గుర్తొచ్చే పేరు మలైకా అరోరా. వయసు పెరుగుతున్నా వన్నె తరగని అందంతో, 50 ఏళ్లు పైబడినా సన్నజాజి తీగలా ఉంటూ తన కిరాక్ డ్యాన్సులతో అభిమానులతో చిందులేయిస్తుంటుది. అయితే ఈ భామ ఎప్పుడూ తన వ్యక్తిగత విషయంలో, హాట్ అందంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. భర్తతో విడిపోయి, యంగ్ హీరోతో డేటింగ్ అండ్ బ్రేకప్.. ఇలా పలు విషయాలతో ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉంటోంది. తాజాగా ఈ భామ ఓ దిగ్గజ క్రికెటర్ తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. అతడితో కలిసి ఆమె సీఎస్కే వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ కు కూడా వచ్చింది.
అతడు మరెవరో కాదు.. ఒకప్పుడు బౌలర్లను భయపెట్టిన లంక దిగ్గజ క్రికెటర్ కుమార సంగక్కర. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇతడితోనే మలైకా అరోరా రాజస్థాన్ రాయల్స్ డగౌట్ లో కనిపించింది. వీరిద్దరు కలిసి సీఎస్కే - రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ ను వీక్షించారు. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట్లో వైరల్ గా మారాయి. దీంతో ఒక్కసారిగా ఊహాగానాలు జోరందుకున్నాయి. వీరిద్దరి మధ్య ఏదో ఉన్నట్లు అంతా చర్చించుకోవడం మొదలు పెట్టారు.

ఏదో జరుగుతోంది...
వీరిద్దరి ఫొటోలను తెగ షేర్ చేస్తూ.. 'మలైకా అరోరా - సంగక్కర డేటింగ్ లో ఉన్నారా?','రాజస్థాన్ రాయల్స్ డగౌట్ లో మలైకా ఎందుకు కూర్చుంది', 'అది కూడా సంగతో పాటు, మలైకా - సంగక్కర మధ్య ఏదో జరుగుతోంది, ఆమె ప్రెజెన్స్ రాజస్థాన్ రాయల్స్ లో బూస్ట్ పెంచింది, ఆమె ఎంతో జాలి, దయ కలిగిన వ్యక్తి. ఫిట్నెస్ కోచ్, గుడ్ హార్డ్ ఉన్న వ్యక్తి కూడా.' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.