CSK VS RR: ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది. ఈ సీజన్ లో ఆడిన తమ మూడో మ్యాచులో పరాజయాన్ని అందుకుంది సీఎస్కే. 183 పరుగల లక్ష్యాన్ని ఛేదించలేక ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది. తద్వారా వరుసగా రెండో ఓటమిని అందుకుంది రుతురాజ్ సేన. అయితే సాధారణంగా ఓటమి తర్వాత ఆయా జట్లు పాయింట్ల పట్టికలో కిందకి పడిపోతాయి. కానీ సీఎస్కే విషయంలో అలా జరగలేదు. ఓటమిని అందుకున్నప్పటికీ పాయింట్ల పటికల్లో చెన్నై జట్టు కిందకి పడిపోకుండా.. తన స్థానాన్ని మెరుగుపరుచుకుని పైకి దూసుకెళ్లింది! ఎలాగంటే?
దమ్ము చాలలేదు...
తాజాగా జరిగిన మ్యాచుతో వరుసగా రెండో ఓటమిని అందుకున్న సీఎస్కే జట్టులో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (63; 44 బంతుల్లో 7×4, 1×6) బ్రిలియంట్ నాక్స్ ఆడాడు. ధోనీ కూడా నెం.7లో వచ్చి 11 బంతుల్లో 16 పరుగులు చేశాడు. కానీ ఇవి సీఎస్కే విజయానికి సరిపోలేదు. ఎందుకంటే ఇతర సీఎస్కే బ్యాటర్లు నిరాశపరిచారు. రచిన్ రవీంద్ర తొలి ఓవర్లోనే ఔట్ అయ్యాడు. రాహుల్ త్రిపాఠి (23) కొన్ని బలమైన షాట్లు ఆడినప్పటికీ ఎనిమిదో ఓవర్లోనే ఔట్ అయ్యాడు. శివమ్ దూబె (18) ధాటిగానే ఆడినప్పటికీ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. విజయ్ శంకర్ (9) కూడా వెంటనే ఔట్ అయ్యాడు. రుతురాజ్‌కు జడేజా కాస్త తోడుగా నిలిచాడు. అయినా చివర్లో ధోనీ,జడ్డూ వేగంగా ఆడలేకపోయారు. చివరికి సీఎస్కే లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. హసరంగ (4/35) చెన్నై పతనాన్ని శాసించాడు. ఆర్చర్ (1/13) గట్టిగానే కట్టడి చేశాడు.

ఆ జట్టు వల్లే సీఎస్కే పైకి..
అయితే ఈ ఓటమి తర్వాత సీఎస్కే, పాయింట్ల పట్టికల్లో కిందకి పడిపోవాల్సింది పోయి.. తన స్థానాన్ని ఏడో స్థానానికి మెరుగు పరుగుపరుచుకుంది. ఇప్పుడు వాళ్ల ఖాతాలో 1 విజయం, రెండు ఓటములతో 2 పాయింట్లు ఉన్నాయి. సీఎస్కే పైకి వెళ్లడానికి కారణం సన్ రైజర్స్ హైదరాబాద్ పేలవ నెట్ రన్ రేట్. సీఎస్కే.. రాజస్థాన్ తో మ్యాచ్ ప్రారంభానికి ముందు -1.013తో ఉంది. కానీ మ్యాచ్ ఓడిపోయాక -0.771తో నిలిచింది. ఇదే సమయంలో సన్ రైజర్స్ కూడా దిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ ఆడింది. కానీ వరుసగా తన రెండో విజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఓటమి తర్వాత సన్ రైజర్స్ ఖాతాలో నెట్ రన్ రేట్ -0.871 ఉంది. అంటే సీఎస్కే (0.771) కన్నా ఎక్కువ నెగటివ్ రన్ రేట్ ఉందన్న మాట. అందుకే ఈ మార్పులు జరిగాయి. సీఎస్కే ఓడినా పైకి వెళ్లింది.
గత సీజన్ లో ఎదురైన అనుభవం వల్లే..
ఐపీఎల్ 2024లోనూ పేలవ నెట్ రన్ రేట్ వల్ల సీఎస్కే.. త్వరగా లీగ్ స్టేజ్ నుంచి త్వరగా బయటకు వెళ్లిపోవాల్సి వచ్చింది. సీఎస్కే, ఆర్సీబీ ఖాతాల్లో గెలుపుఓటములు, పాయింట్లు ఒకేలా ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ కారణంగా ఆర్సీబీ కన్నా సీఎస్కేనే ముందు వైదొలగాల్సి వచ్చింది. అందుకే ఈ సారి సీఎస్కే నెట్ రన్ రేట్ పై కాస్త దృష్టి పెట్టినట్టుంది.
ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టిక..
ఇకపోతే ఐపీఎల్ 2025 సీజన్ లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచుల ప్రకారం పాయింట్ల పట్టికల్లో ఆర్సీబీ అగ్రస్థానంలో ఉంది. దిల్లీ క్యాపిటల్స్ రెండో ర్యాంకును దక్కించుకుంది. ముంబయి ఇండియన్స్ వరుస ఓటములో చివరి స్థానంలో నిలిచింది.