Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: చరిత్ర సృష్టించిన సీఎస్కే - చెత్త రికార్డ్ సాధించడంలో!

CSK VS RR: ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ పేలవ ప్రదర్శన కొసాగుతోంది. మొదట ముంబయి ఇండియన్స్ పై విజయంతో సీజన్ ను ఘనంగా ఆరంభించినా... ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ పై వరుసగా రెండో ఓటమిని అందుకుంది. రాజస్థాన్‌ రాయల్స్ తో జరిగిన మ్యాచులో లక్ష్య ఛేదనకు చేరువగా వచ్చినప్పటికీ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. మొదట రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవరల్లో 9 వికెట్లకు 182 పరుగులు చేసింది. అనంతరం చెన్నై జట్టు 176 పరుగులకే పరిమితమై పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది.

ఐపీఎల్ చరిత్రలో చెత్త రికార్డ్...
ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ లో ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఛేదనలో సీఎస్కేకు ఇది రెండో ఓటమి కాదు. వరుసగా 9వది కావడం గమనార్హం. అది కూడా 180 ప్లస్ పరుగులను ఛేదించలేక చతికిలపడుతోంది. గత ఏడేళ్లుగా అంటే 2019 నుంచి ఇదే తంతు కొనసాగుతోంది. ఇప్పటివరకు 9 సార్లు జట్టు ఛేదనకు దిగగా.. అన్నింటిలోనూ ఆ జట్టు ఓటమిపాలైంది. మరే ఇతర జట్టు కూడా ఛేజింగ్ లో వరుసగా ఇన్ని మ్యాచులు ఓడిపోవకపోవడం గమనార్హం.

CSK VS RR Chennai super kings 9 consecutive losses while chasing 180 plus in IPL from 2019

మొత్తం 27 సార్లు.. అందులో 15..
పైగా ఈ ఓడిపోయిన మ్యాచులో సీఎస్కే 7 సార్లు టాస్ నెగగ్గా.. రెండు సార్లు ఓడిపోయింది. ఐపీఎల్ చరిత్రలో మొత్తంగా సీఎస్కే 180పైగా స్కోర్ ఛేజింగ్ కోసం 27 సార్లు బరిలోకి దిగింది. అందులో 15 సార్లు విజయం సాధించింది. ఇందులో 13 విజయాల్లో సీఎస్కే మాజీ ప్లేర్ సురేశ్ రైనా భాగస్వామ్యమవ్వడం విశేషం.

కాగా, ఈ మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ జట్టులో బ్యాటుతో నితీశ్‌ రాణా, బంతితో హసరంగ మెరవడంతో చెన్నై ఓడింది. . నితీశ్‌ రాణా 36 బంతుల్లో 10×4, 5×6 సాయంతో 81 పరుగులు, హసరంగ (4/35) చెన్నైని దెబ్బతీశారు.

Story first published: Monday, March 31, 2025, 9:28 [IST]
Other articles published on Mar 31, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+