CSK vs RCB Toss Update: ఫస్ట్ బ్యాటింగ్ చెన్నైదే.. కీలక మార్పుతో బరిలోకి బెంగళూరు

చెన్నైసూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాప్ డుప్లిసెస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో రవీంద్ర జడేజా నేతృత్వంలోని చెన్నైసూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది. గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతో పోలిస్తే ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఒక మార్పుతో బరిలోకి దిగుతుండగా.. చెన్నై ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. కాగా నాలుగు మ్యాచ్‌ల్లో 3 విజయాలతో పాయింట్ల పట్టికలో ఆర్సీబీ మూడో స్థానంలో ఉండగా.. ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా గెలవని చెన్నైసూపర్ కింగ్స్ చివరి స్థానంలో ఉంది.

జట్టులో ఒక మార్పు
''మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. టోర్నీ ట్రెండ్‌తో పాటు టాస్ గెలిచి బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. నాకు సీఎస్కే టీం ఆటగాళ్ళు తెలుసు. వాళ్లకు కూడా నా ఆట గురించి బాగా తెలుసు. ఇది ఈ రోజు నా సోదరులతో ఆడటం లాంటిది. బంతితో మేం మెరుగ్గా ఉన్నాం. అయితే చివరి రెండు ఓవర్లలో మెరుగవ్వాలి. ఈ మ్యాచ్‌లో ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నాం. జోష్ హేజిల్‌వుడ్ ఈ మ్యాచ్‌లో ఆడుతున్నాడు. అతను కొత్త బంతితో ఏం చేస్తాడో చూడడానికి ఉత్సాహంగా ఉన్నాం.'' అని అని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాప్ డుప్లిసెస్ చెప్పాడు.

ఈ మ్యాచ్‌లో గెలుస్తాం
''ఈ వికెట్‌ని చూశాక టాస్ గెలిస్తే మేము కూడా ముందుగా బౌలింగ్ చేసి ఉండేవాళ్లం. మేము ఇక్కడికి వచ్చి పోటీ క్రికెట్ ఆడాలని చూస్తాము. టాస్ మా దారిలో వెళ్లడం లేదు. అది వేరే దారిలో వెళ్తుంది. జట్టుగా ప్రతి గేమ్ కీలకమే. మేము గెలవాడనికి ప్రయత్నిస్తాము. మా మొదటి విజయాన్ని ఆశాజనకంగా అందుకుంటాము. మా టీంలో ఎలాంటి మార్పులు లేవు.'' అని చెన్నైసూపర్ కింగ్స్ కెప్టెన్ రవీంద్ర జడేజా తెలిపాడు.

తుది జట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగా, సుయాష్ ప్రభుదేశాయ్, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్
చెన్నై సూపర్ కింగ్స్: రాబిన్ ఉతప్ప, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా(కెప్టెన్), ఎంఎస్ ధోని(వికెట్ కీపర్), డ్వేన్ బ్రావో, క్రిస్ జోర్డాన్, మహేశ్ తీక్షణ, ముఖేష్ చౌదరి

హెడ్ టూ హెడ్ రికార్డులు
ఐపీఎల్‌లో చెన్నైసూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు హెడ్ టూ హెడ్ రికార్డుల్లో సీఎస్కేదే పై చేయిగా ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 28 మ్యాచ్‌ల్లో తలపడగా అత్యధికంగా చెన్నై 18 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇక బెంగళూరు 9 మ్యాచ్‌ల్లో గెలవగా.. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఇరు జట్లు తలపడిన మ్యాచ్‌ల్లో ఓ ఇన్నింగ్స్‌లో ఆర్సీబీ అత్యధికంగా 205 పరుగులు చేయగా.. సీఎస్కే 208 పరుగులు చేసింది. ఇక అత్యల్పంగా ఆర్సీబీ 70, చెన్నై 82 పరుగులు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications