CSK VS RCB Memes: ఐపీఎల్ 2025 చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ దారుణంగా ఓడిపోయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై పరాజయం పొందింది. సొంత మైదానంలోనే దాదాపు 50 పరుగుల తేడాతో ఓటమిని అందుకుంది. దీంతో 2008 తర్వాత తొలిసారి చెపాక్ స్టేడియంలో సీఎస్కేపై విజయం సాధించింది ఆర్సీబీ.
అయితే మ్యాచ్ అనంతరం సీఎస్కేను ఆటాడేసుకునేందుకు సోషల్ మీడియా యూజర్స్ కు మంచి స్టప్ దొరికింది. మ్యాచును ఉద్దేశిస్తూ ఎక్స్ లో మీమ్స్ వెలువెత్తుతున్నాయి. ధోనీ బ్యాటింగ్ ఆర్డర్ సహా, ఆ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ ఆర్డర్ పూర్తిగా విఫలమవ్వడంతో క్రికెట్ అభిమానులు, నెటిజన్లు సీఎస్కేపై గట్టిగా సెటైర్లు వేస్తున్నారు. మొత్తంగా నెటిజన్ల ఈ సరదా మీమ్స్ తెగ నవ్వులు పంచుతున్నాయి.

దీంతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మీమ్స్, జోకులను కాసేపు సరదాగా నవ్వుకోవడం కోసం ఈ కథనంలో వాటిని జత చేస్తున్నాం. అయితే వీటిలో ఉన్న అంశాలన్నీ మీమ్స్ క్రియేటర్ల వ్యక్తిగతం మాత్రమే. మీరు ఓ సారి వీటిని సరదాగా చూసేయండి..
మ్యాచ్ విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీలో కోహ్లీ (31, 30 బంతుల్లో) మినహా మిగతా బ్యాటర్లందరూ దుకుడుగా ఆడారు. దీంతో ఆ జట్టు 7 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. సీఎస్కే స్పిన్ విభాగంలో కేవలం నూర్ అహ్మద్ (3/36) మాత్రమే ఆర్సీబీపై ప్రభావం చూపించాడు. సీనియర్లు స్పిన్నర్లు జడేజా, అశ్విన్.. ఆర్సీబీ బ్యాటర్ల దెబ్బకు తేలిపోయారు.
ఇక రెండో ఇన్నింగ్స్ వన్డే వే ట్రాఫిక్ లా సాగింది. సీఎస్కే బ్యాటింగ్ యూనిట్ అంతా ఆర్సీబీకి సరెండర్ అయిపోయింది. హేజిల్‌వుడ్ (3/21) సీఎస్కే పతనాన్ని శాసించారు. ఇతర బౌలర్ల యశ్ దయాళ్ (2/18), లివింగ్‌స్టన్ (2/28) మంచి ప్రదర్శన చేయడంతో 17 ఏళ్ల తర్వాత చెపాక్ లో సీఎస్కేపై ఆర్సీబీ విజయం సాధించింది. ధోనీ ఆఖర్లో నెం.9లో వచ్చి రెండు సిక్సులు, మూడు ఫోర్లు సాయంతో 30* (16) స్కోరు చేసిన ఫలితం దక్కలేదు. అప్పటికే మ్యాచ్ చేజారిపోయింది. సీఎస్కేకు సొంత గడ్డపైనే ఓటమి చుట్టుముట్టింది.