CSK vs RCB: శివమ్ దూబే, రాబిన్ ఊతప్ప విశ్వరూపం.. బెంగళూరు ముందు కొండంత లక్ష్యం

టోర్నీలో ఇప్పటికే 4 మ్యాచ్‌లు ఆడిన ఒక్క విజయం కూడా నమోదు చేయలేకపోయామనే కసి ఏమో కానీ బ్యాటింగ్‌లో చెన్నైసూపర్ కింగ్స్ దుమ్ములేపింది. ఆ జట్టు బ్యాటర్లు శివమ్ దూబే, రాబిన్ ఊతప్ప విశ్వరూపంలో చూపించి కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ముందు సీఎస్కే ఏకంగా 217 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది. పవర్‌ప్లే ముగిసే సమయానికి 35 పరుగులే చేసిన సీఎస్కే స్కోర్ బోర్డును ఊతప్ప, దూబే తమ విధ్వంసకర ఆట తీరుతో పరుగులు పెట్టించారు. భారీ సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో 73 బంతుల్లోనే 165 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఊతప్ప ఇన్నింగ్స్‌లో 8, దూబే ఇన్నింగ్స్‌లో 9 సిక్సులు ఉన్నాయంటేనే వారి విధ్వంసం ఏ స్థాయిలో కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో వీరిద్దరు చివరి 10 ఓవర్లలోనే 155 పరుగులు, చివరి 5 ఓవర్లలోనే 83 పరుగులు జోడించడం గమనార్హం.
మరోసారి నిరాశపరిన రుతురాజ్ గైక్వాడ్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైసూపర్ కింగ్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (17) మరోసారి నిరాశపరిచాడు. ఇన్నింగ్స్ నాల్గో ఓవర్లో హెజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు కట్టడి చేయడంతో పవర్‌ప్లే ముగిసే సమయానికి సీఎస్కే వికెట్ నష్టానికి 35 రన్స్ మాత్రమే చేసింది. ఆ వెంటనే ఏడో ఓవర్లో మొయిన్ అలీ (3)ని సుయాష్ ప్రభుదేసాయి రనౌట్ చేయడంతో సీఎస్కే 36 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.
హాఫ్ సెంచరీలతో ఊతప్ప, దూబే విధ్వంసం
అనంతరం సీఎస్కే ఆటగాళ్లు రాబిన్ ఊతప్ప, శివమ్ దూబే చెలరేగి ఆడారు. కష్టాల్లో ఉన్న సీఎస్కేను ఆదుకోవడమేకాకుండా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో చూస్తుండగానే హాఫ్ సెంచరీ, సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 53 బంతుల్లో సెంచరీ భాగస్వామ్యాన్ని పూర్తి చేశారు. ఫోర్లు, సిక్సులతో ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడుతూ హాఫ్ సెంచరీలతో దుమ్ములేపారు. రాబిన్ ఊతప్ప 33 బంతుల్లో, శివమ్ దూబే 30 బంతుల్లో హాఫ్ సెంచరీలు చేశారు. ఊతప్పకు ఐపీఎల్‌లో 27వ హాఫ్ సెంచరీ కాగా, దూబేకు మూడవది. ఈ సీజన్లో రెండవది.
165 పరుగుల భాగస్వామ్యం
సిరాజ్ వేసిన 18వ ఓవర్ ఐదో బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించిన ఊతప్ప 81 పరుగుల వద్ద క్యాచ్ ఔటయ్యాడు. కానీ అది నోబాల్ కావడంతో బతికిపోయాడు. దీంతో ఊతప్ప సెంచరీ కొట్టడం ఖాయమనిపించింది. ఈ క్రమంలో శివమ్ దూబే వరుసగా సిక్సులు బాదడంతో సీఎస్కే స్కోర్ 200 దాటింది. హసరంగ వేసిన 19వ ఓవర్ ఐదో బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించిన ఊతప్ప.. విరాట్ కోహ్లీకి దొరికిపోయాడు. ఈ క్రమంలో ఊతప్ప, దూబే 165 పరుగుల భారీ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. కేవలం 73 బంతుల్లోనే ఈ భాగస్వామ్యాన్ని నెలకొల్పడం గమనార్హం. మొత్తానికి 50 బంతులు ఎదుర్కొన్న ఊతప్ప 4 ఫోర్లు, 9 సిక్సులతో 88 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాతి బంతికే కెప్టెన్ రవీంద్ర జడేజా సైతం భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటవడంతో సీఎస్కే 201 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది.
216-4
ఇక హేజిల్‌వుడ్ వేసిన చివరి ఓవర్లో శివమ్ దూబే 2 సిక్సులతో 15 పరుగులు బాదడంతో సీఎస్కే ఇన్నింగ్స్ 4 వికెట్ల నష్టానికి 216 పరుగుల వద్ద ముగిసింది. 8 సిక్సులు, 5 ఫోర్లతో కేవలం 46 బంతుల్లోనే 95 పరుగులతో శివమ్ దూబే అజేయంగా నిలిచాడు. దూబే, ఊతప్ప దెబ్బకు ఆర్సీబీ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అక్షయ్ దీప్ 4 ఓవర్లలోనే ఏకంగా 58 పరుగులు ఇచ్చాడు. ఇక హసరంగ 2, హేజిల్‌వుడ్ ఒక వికెట్ తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications