CSK vs RCB: దూబే, ఊతప్ప విధ్వంసం.. తిప్పేసిన తీక్షణ, జడేజా.. చెన్నైకి తొలి విజయం

చెన్నైసూపర్ కింగ్స్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి. వరుస పరాజయాలకు చెక్‌పెడుతూ ఐపీఎల్ 2022లో చెన్నైసూపర్ కింగ్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. నేడు జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన సీఎస్కే.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో సీఎస్కే బ్యాటింగ్, బౌలింగ్‌లో అధిపత్యం చెలాయించింది. మొదట బ్యాటింగ్‌లో రాబిన్ ఊతప్ప (88), శివమ్ దూబే (95*) 165 పరుగుల భారీ భాగస్వామ్యంతో 216 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం బౌలింగ్‌లో మహేష్ తీక్షణ, రవీంద్ర జడేజా తమ స్పిన్ మాయజాలంతో ఆర్సీబీని 193 పరుగులకే కట్టడి చేశారు. వీరిద్దరే 7 వికెట్లు కూల్చారు. దీంతో లీగ్‌లో తమ 200వ మ్యాచ్‌లో సీఎస్కే అద్భుత విజయాన్ని అందుకుంది.
పవర్‌ప్లేలోనే 3 వికెట్లు
చెన్నైసూపర్ కింగ్స్ విసిరిన 217 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 20 పరుగులకే కీలకమైన కెప్టెన్ ఫాఫ్ డుప్లిసెస్ (8), విరాట్ కోహ్లీ (1) వికెట్లను కోల్పోయింది. వీరిని తీక్షణ, ముఖేష్ చౌదరీ ఫెమిలియన్ చేర్చాడు. ఆరో ఓవర్లో అనుజ్ రావత్(12)ను మహేష్ తీక్షణ ఎల్బీలో ఔట్ చేశాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సమయానికి ఆర్సీబీ 3 వికెట్ల నష్టానికి 42 పరుగులుచేసింది.
తిప్పేసిన మహేష్ తీక్షణ
ఆ వెంటనే 7వ ఓవర్లో దూకుడుగా ఆడుతున్న మాక్స్‌వెల్(26)ను జడేజా క్లీన్‌బౌల్డ్ చేయడంతో ఆర్సీబీ 50 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో షాబాజ్ అహ్మద్, సుయాష్ ప్రభుదేసాయి కాసేపు పోరాడారు. వీరిద్దరు ఐదో ఓవర్లలోనే 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో జట్టు స్కోర్ 110 పరుగుల వద్ద ఉండగా సుయాష్ ప్రభుదేసాయి (34 రన్స్, 5 ఫోర్లు, ఒక సిక్సు)ని మహేష్ తీక్షణ ఔట్ చేయడంతో ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. ఆ వెంటనే తన తర్వాతి ఓవర్లో షాబాజ్ అహ్మద్ (41 రన్స్, 4 ఫోర్లు)ను కూడా తీక్షణ ఫెమిలియన్ చేర్చడంతో 14.3 ఓవర్లలో ఆర్సీబీ 133 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది.
జడేజా మాయ
ఇక 16వ ఓవర్లో హసరంగ (7), అక్షయ్ దీప్‌ను జడేజా ఫెమిలియన్ చేర్చడంతో 146 పరుగులకే ఆర్సీబీ 8 వికెట్లు కోల్లోయి పరాజయానికి చేరువైంది. ఈ సమయంలో దినేష్ కార్తీక్ కాసేపు పోరాడాడు. బ్రావో వేసిన 18వ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించిన దినేష్ కార్తీక్ (34 రన్స్, 2 ఫోర్లు, 3 సిక్సులు) బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న జడేజాకు దొరికిపోయాడు. దీంతో ఆర్సీబీ 171 పరుగుల వద్ద 9వ వికెట్ కోల్పోయింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి ఆర్సీబీ 193-9 వద్దే నిలిచిపోయింది. దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై చెన్నైసూపర్ కింగ్స్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. సీఎస్కే బౌలర్లలో మహేష్ తీక్షణ 4, రవీంద్ర జడేజా 3 వికెట్లతో చెలరేగారు. ముఖేష్ చౌదరీ, డ్వేన్ బ్రావో తలో వికెట్ తీశారు.
శివమ్ దూబే, ఊతప్ప విశ్వరూపం
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైసూపర్ కింగ్స్ 36 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. రుతురాజ్ గైక్వాడ్ (17), మొయిన్ అలీ (3) రాణించలేకపోయారు. ఆ తర్వాత శివమ్ దూబే (95*రన్స్, 8 సిక్సులు, 5 ఫోర్లు), రాబిన్ ఊతప్ప (88 రన్స్, 4 ఫోర్లు, 9 సిక్సులు) 73 బంతుల్లోనే 165 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 216- 4 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆర్సీబీ బౌలర్లలో హసరంగ 2, హెజిల్‌వుడ్ ఒక వికెట్ తీశారు.
స్కోర్లు
చెన్నైసూపర్ కింగ్స్: 216-4
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: 193-9
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications