For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSK vs RCB: చెపాక్‌ చెన్నైకి కోట.. సవాల్ తప్పదు.. ఆర్సీబీకి వాట్సన్ వార్నింగ్!

CSK vs RCB: ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా శుక్రవారం చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆర్సీబీతో తలపడనుంది. ఈ మ్యాచ్ రెండు జట్ల అభిమానుల మధ్య భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ఈ మ్యాచ్ కు సంబంధించిన అన్ని టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ సీజన్ ను ఇరు జట్లు విజయంతోనే ప్రారంభించాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఈడెన్ గార్డెన్స్‌లోనే ఓడించింది. సీఎస్కే జట్టు ముంబై ఇండియన్స్ జట్టును ఓడించిన సంగతి తెలిసిందే.

చెన్నై సూపర్ కింగ్స్ సొంత మైదానమైన చెపాక్ స్టేడియం వేదికగా ఆర్సీబీ తలపడనుంది. ఈ వాతావరణంలో చెన్నైని దాని సొంత గడ్డపై ఓడించడం ఆర్సీబీకి అతిపెద్ద సవాల్ అని మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ అని హెచ్చరించారు. చెన్నై జట్టుతో జాగ్రత్తగా ఉండాలని.. ఒక్క పొరపాటు చేసినా ఓటమి తప్పదని వాట్సన్ వార్నింగ్ ఇచ్చాడు. వాట్సన్ కు గతంలో చెన్నై, ఆర్సీబీ రెండు జట్లలో ఆడిన అనుభవం ఉండడం గమనార్హం.

CSK vs RCB Shane Watson Warns RCB About Challenging Chepauk Pitch
Take a Poll

చెన్నై సూపర్ కింగ్ సొంత మైదానమైన చెపాక్ స్టేడియంలో ఆర్సీబీకి పెనుసవాల్ తప్పదని.. సీఎస్కే జట్టులో నాణ్యమైన బౌలర్లు ఉన్నారని వాట్సన్ చెప్పుకొచ్చాడు. చెన్నై జట్టుకు ధీటుగా సమాధానం ఇవ్వాలంటే బెంగళూరు కూడా సరైన కూర్పుతో బరిలోకి దిగాలన్నారు. ముంబైపై సీఎస్కే తరఫున ఆడిన ముగ్గురు అద్భుతంగా రాణించారన్నారు. ఆ జట్టులోని ముగ్గురు స్పిన్నర్లు అశ్విన్, జడేజా, నూర్ అహ్మద్ చెపాక్ స్టేడియంలో అసాధారణంగా రాణిస్తారని చెప్పాడు. ఈ పిచ్ పై వారిని ఎదుర్కోవడం అంత తేలికేం కాదన్నాడు. సీఎస్కే తరఫున ఆడిన తొలి మ్యాచ్ లోనే నూర్ మహ్మద్ అసాధారణ ప్రదర్శన ఇచ్చాడని.. ఇది జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచిందన్నాడు. నూర్ అహ్మద్ తమకు వికెట్ తీసే బౌలర్ అని అర్థం చేసుకున్నందుకు షేన్ వాట్సన్ సీఎస్కేను ప్రశంసించాడు.

Story first published: Thursday, March 27, 2025, 14:40 [IST]
Other articles published on Mar 27, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+