For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSK vs RCB: ధోనీ మైండ్ గేమ్..మాక్సీ కోసం అతడిపై వేటు!

దేశంలో క్రికెట్ పండగకు వేళైంది. రేపటి నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఈ పోరు రాత్రి 8 గంటలకు మొదలవుతుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు చెపాక్ స్టేడియం వేదికగా మారింది. స్టార్ ప్లేయర్లకు కొదవలేని ఇరు జట్లు ఫేవరేట్‌గా రంగంలోకి దిగుతున్నాయి.

కానీ గణాంకాల్లో బెంగళూరుపై చెన్నైదే పైచేయి. చెపాక్‌లో సీఎస్‌కే, ఆర్సీబీ ఎనిమిది మ్యాచ్‌ల్లో తలపడింది. 2008 తర్వాత ఇప్పటివరకు రాయల్ ఛాలెంజర్స్ ఒక్కసారి కూడా గెలవలేదు. ఐపీఎల్‌‌లో ఓవరాల్‌‌గా ఇరు జట్లు 31 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. చెన్నై 20, బెంగళూరు 10 మ్యాచ్‌ల్లో గెలిచాయి. ఓ మ్యాచ్ ఫలితం రాలేదు.

CSK vs RCB Dhoni could drop Moeen Ali to counter Maxwell against RCB match in IPL 2024

అయితే చరిత్రను పక్కనపెట్టి సీజన్‌ను విజయంతో ఆరంభించాలని, కప్ కలను సాకారం చేసుకోవాలని ఆర్సీబీ కసిగా బరిలోకి దిగుతోంది. మరోవైపు తన సొంత మైదానంలో ప్రత్యర్థిని మట్టకరిపించి ఆరో టైటిల్ వేటను ఘనంగా ప్రారంభించాలని సీఎస్‌కే ఉవ్విళ్లూరుతోంది. కానీ సీఎస్‌కేను గాయాల బెడద వేదిస్తోంది. దీంతో చెన్నై తుదిజట్టులో ఎవరుంటారనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది.

కాగా, రేపు మైండ్ గేమ్‌తో ధోనీ తన మార్క్‌ను మరోసారి చూపించనున్నాడు. అంచనాలకు మించి తుదిజట్టును సిద్ధం చేస్తున్నాడు. స్పిన్‌కు అనుకూలించే చెపాక్‌లో ఆర్సీబీ బలాలు, బలహీనతలను లెక్కకట్టి జట్టుకూర్పు చేస్తున్నాడు. గాయాలతో డెవాన్ కాన్వే, పతిరన దూరమవ్వడం సీఎస్‌కే ఎదురుదెబ్బే. కానీ వాళ్ల గైర్హాజరీ జట్టుపై ప్రభావం చూపకుండా ప్రణాళికలు రచిస్తున్నాడు.

కాన్వే స్థానంలో ఓపెనర్‌గా రచిన్ రవీంద్రకు అవకాశం ఇవ్వనున్నాడు. రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి రచిన్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. లెఫ్ట్-రైట్ హ్యాండెడ్ జోడీ జట్టుకు శుభారంభాన్ని ఇస్తుందని భావిస్తున్నాడు. వన్‌డౌన్‌లో అజింక్య రహానె రానున్నాడు. గత సీజన్‌లో మాదిరిగానే మెరుపు బ్యాటింగ్ చేయాలని రహానెకు సూచనలు అందాయి.

అయితే నాలుగో స్థానం కోసం మొయిన్ అలీ, డారిల్ మిచెల్ పోటీపడుతున్నారు. స్పిన్నర్లపై దూకుడుగా అలీ బ్యాటింగ్ చేయగలడు. కానీ అలీ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్. తుదిజట్టులో ఉండే రచిన్ రవీంద్ర, శివమ్ దూబె, రవీంద్ర జడేజా కూడా ఎడమచేతి వాటం బ్యాటర్లే. దీంతో మిచెల్ జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. అంతేగాక ఆర్సీబీ జట్టులో మాక్స్‌వెల్ పార్ట్‌టైమ్ స్పిన్నర్. లెఫ్ట్ హ్యాండర్లను ఎక్కువ‌గా తీసుకుంటే మాక్సీకి నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసే అవకాశం తామే ఇచ్చినట్లు అవుతుందని ధోనీ భావిస్తున్నాడు. ఆఫ్ స్పిన్నర్ అయిన మాక్సీ ఎడమచేతి వాటం బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. అందుకే తొలి మ్యాచ్‌‌లో అలీపై వేటు వేయాలనుకుంటున్నాడు.

పతిరన గాయంతో దూరమవ్వడంతో ముస్తాఫిజుర్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే గాయం నుంచి కోలుకుంటున్న ముస్తాఫిజుర్‌ను విశ్రాంతి ఇవ్వాలని భావిస్తే ముకేశ్ చౌదరి జట్టులోకి వస్తాడు. స్పిన్నర్ తీక్షణ జట్టులో ఉంటాడు. దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్ పేస్ బాధ్యతలను అందుకుంటారు.

చెన్నై సూపర్ కింగ్స్ తుదిజట్టు (అంచనా)
రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, అజింక్య రహానె, డారిల్ మిచెల్, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, ధోనీ, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, ముస్తాఫిజుర్/ముకేశ్ చౌదరి, తీక్షణ

Story first published: Thursday, March 21, 2024, 15:50 [IST]
Other articles published on Mar 21, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+