For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSK vs RCB: గ‌త సీజ‌న్లో ఆరెంజ్ క్యాప్ విన్న‌ర్‌.. ఈ సీజ‌న్లో అట్ట‌ర్ ఫ్లాప్.. రుతురాజ్ గైక్వాడ్ వైఫ‌ల్యం

CSK vs RCB: Continue Chennai opener Ruturaj Gaikwad Failure and he scored only 35 runs with 7 average in IPL 2022.

ఐపీఎల్ 2022లో చెన్నైసూపర్ కింగ్స్ ఓపెన‌ర్ రుతురాజ్ గైక్వాడ్ ఫేలవ ప్ర‌ద‌ర్శ‌న కొన‌సాగుతుంది. తాజాగా రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో ఆడిన మ్యాచ్‌లోనూ విఫ‌ల‌మై మ‌రోసారి నిరాశ‌ప‌రిచాడు. ఈ మ్యాచ్‌లో క్రీజులో కుదురుకున్నట్లే క‌న‌పించిన‌ప్ప‌టికీ జోష్ హేజిల్ వుడ్ వేసిన నాల్గో ఓవ‌ర్లో రుతురాజ్ ఎల్బీడ‌బ్ల్యూలో ఔట్ అయ్యాడు. రివ్యూకు వెళ్లిన ఫలితం లేక‌పోయింది. మొత్తంగా ఈ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ 16 బంతులు ఎదుర్కొని 3 ఫోర్ల‌తో 17 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు.

ఇప్ప‌టివ‌ర‌కు ఈ సీజ‌న్‌లో సీఎస్కే ఆడిన 5 మ్యాచ్‌ల్లో రుతురాజ్ 7 స‌గ‌టుతో 35 ర‌న్స్ మాత్ర‌మే చేశాడు. ఈ సీజ‌న్‌లో రుతురాజ్ గ‌ణాంకాలు 0, 1, 1, 16, 17గా ఉన్నాయి. గ‌త సీజ‌న్‌లో టాప్ స్కోర‌ర్‌గా నిలిచి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న రుతురాజ్ గైక్వాడ్ సీఎస్కే ట్రోఫీ గెల‌వ‌డంలో కీల‌క‌పాత్ర పోషించాడు. ఆ సీజ‌న్‌లో మొత్తంగా 16 మ్యాచ్‌ల్లో 45 స‌గ‌టుతో 635 ర‌న్స్ చేశాడు. ఇందులో ఒక సెంచ‌రీ, 4 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. కాగా ఈ సీజ‌న్‌లో రుతురాజ్ గైక్వాడ్‌ వైఫ‌ల్యం సీఎస్కేకు పెద స‌మ‌స్య‌గా మారింది. రుతురాజ్ గైక్వాడ్ రాణించ‌క పోవ‌డంతో బ్యాటింగ్‌లో ఆ జ‌ట్టు మంచి స్కోర్ చేయ‌లేక‌పోతుంది. గ‌త సీజ‌న్‌లో ఆరెంజ్‌క‌ప్ విన్న‌ర్ ఈ సీజ‌న్‌లో దారుణంగా విఫ‌ల‌మ‌వ‌డాన్ని సీఎస్కే అభిమానులు సైతం జీర్ణించుకోలేక‌పోతున్నారు.

తుది జ‌ట్లు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్‌), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్ (వికెట్ కీప‌ర్), షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగా, సుయాష్ ప్రభుదేశాయ్, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్

చెన్నై సూపర్ కింగ్స్: రాబిన్ ఉతప్ప, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా(కెప్టెన్), ఎంఎస్ ధోని(వికెట్ కీప‌ర్), డ్వేన్ బ్రావో, క్రిస్ జోర్డాన్, మహేశ్ తీక్షణ, ముఖేష్ చౌదరి

Story first published: Tuesday, April 12, 2022, 20:24 [IST]
Other articles published on Apr 12, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+