For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSK vs RCB: భారీ భాగ‌స్వామ్యంతో అరుదైన రికార్డులు సాధించిన శివ‌మ్ దూబే, రాబిన్ ఊత‌ప్ప‌

CSK vs RCB: Chenni super kings batters shivam dube and Robin uthappa Record Partnership and Break some Record

రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నైసూప‌ర్ కింగ్స్ బ్యాట‌ర్లు శివ‌మ్ దూబే, రాబిన్ ఊత‌ప్ప దుమ్ములేపారు. ఇద్ద‌రు కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్‌లతో చెల‌రేగారు. 165 ప‌రుగుల భారీ సెంచ‌రీ భాగ‌స్యామ్యంతో టీంకు భారీ స్కోర్ అందించారు. ఈ క్ర‌మంలో వ్య‌క్తిగ‌త రికార్డులే కాకుండా టీంకు ప‌లు రికార్డుల‌ను అందించారు.

శివ‌మ్ దూబే, రాబిన్ ఊత‌ప్ప విధ్వంసం ధాటికి చెన్నైసూప‌ర్ కింగ్స్ చివ‌రి 10 ఓవ‌ర్ల‌లోనే ఏకంగా 156 ప‌రుగులు చేసింది. ఓవ‌ర్‌కు 15కు పైగా ర‌న్‌రేట్‌తో ప‌రుగులు రాబ‌ట్టింది. దీంతో ఐపీఎల్‌లో చివ‌రి 10 ఓవ‌ర్ల‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన జ‌ట్ల జాబితాతో సీఎస్కే మూడో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో 172 ప‌రుగుల‌తో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు మొద‌టి స్థానంలో ఉంది. 2016లో ఆర్సీబీ గుజ‌రాత్ టైటాన్స్‌పై ఈ రికార్డు సాధించింది. ఒక 2014లోచెన్నైసూప‌ర్ కింగ్స్‌పై 162 ప‌రుగులు చేసిన పంజాబ్ కింగ్స్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది.

CSK vs RCB: Chenni super kings batters shivam dube and Robin uthappa Record Partnership and Break some Record

ఆర్సీబీతో జ‌రిగిన ఈ మ్యాచ్‌లో సీఎస్కే బ్యాట‌ర్లు శివ‌మ్ దూబే, రాబిన్ ఊత‌ప్ప మూడో వికెట్‌కు 165 ప‌రుగుల భారీ భాగ‌స్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్ర‌మంలో ఐపీఎల్‌లో సీఎస్కే త‌ర‌ఫున‌ ఓ వికెట్‌కు అత్య‌ధిక భాగ‌స్వామ్యం నెలకొల్పిన జాబితాలో ఈ జోడి రెండో స్థానంలో ఉంది. 2020లో పంజాబ్ కింగ్స్‌పై షేన్ వాట‌న్స్‌, ఫాఫ్ డుప్లిసెస్ జోడి అజేయంగా 181 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెలకొల్పి ఈ జాబితాలో మొద‌టి స్థానంలో ఉంది. ఇక 2011లో ఆర్సీబీపై 159 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్పిన ముర‌ళీ విజ‌య్, మైక్ హ‌స్సీ జోడి ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. అలాగే ఈ మ్యాచ్‌లో 95 ప‌రుగులు చేయ‌డం ద్వారా ఆర్సీబీపై అత్య‌ధిక వ్య‌క్తి గ‌త స్కోర్ చేసిన ముర‌ళీ విజ‌య్ రికార్డును శివ‌మ్ దూబే స‌మం చేశాడు. 2011 ఆర్సీబీపై ముర‌ళీ విజ‌య్ 95 ప‌రుగులు చేశాడు.

Story first published: Tuesday, April 12, 2022, 23:57 [IST]
Other articles published on Apr 12, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+