
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో సుయాష్ ప్రభుదేసాయి సూపర్ ఫీల్డింగ్‌తో చెన్నైసూపర్ కింగ్స్ వన్‌డౌన్ బ్యాటర్ మొయిన్ అలీ రనౌట్ అయ్యాడు. గ్లెయిన్ మాక్స్‌వెల్ వేసిన ఏడో ఓవర్ నాల్గో బంతిని మొయిన్ అలీ బ్యాక్‌వర్డ్ పాయింట్‌కి కుడి వైపునకు ఆడాడు. ఆ బంతిని ఆర్సీబీ బౌలర్ సుయాష్ ప్రభుదేసాయి అద్భుతంగా డైవ్ చేసి అందుకున్నాడు. కానీ అది గమనించని అలీ సింగిల్ వస్తుందని రన్‌కు పరిగెత్తాడు. ఇంతలోనే సుయాష్ ప్రభుదేసాయి బంతిని వికెట్ల వైపునకు విసిరాడు. అది గమనించిన రాబిన్ ఊతప్ప వెనక్కిపంపాడు. కానీ అప్పటికే అలీ పిచ్ మధ్యలోకి వచ్చేశాడు. కాస్త ఆలస్యం అవడంతో బంతిని అందుకున్న వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ వికెట్లను కొట్టడంతో అలీ ఇన్నింగ్స్ ముగిసింది. అప్పటికి 8 బంతులు ఎదుర్కొన్న మొయిన్ అలీ 3 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో చెన్నైసూపర్ కింగ్స్ 36 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఇది చూసిన నెటిజన్లు కాస్త చూసుకోని పరిగెత్తాలని అలీకి సూచిస్తున్నారు.
అంతకుముందు జట్టు స్కోర్ 19 పరుగుల వద్ద ఉండగా 17 (3 ఫోర్లు) పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్ ఔట్ అయ్యాడు. జోష్ హెజిల్‌వుడ్ వేసిన నాల్లో ఓవర్లో రుతురాజ్ ఎల్బీడబ్ల్యూలో ఔట్ అయ్యాడు. అయితే 36 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన సీఎస్కేను రాబిన్ ఊతప్ప, శివమ్ దూబే ఆదుకున్నారు.
తుది జట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగా, సుయాష్ ప్రభుదేశాయ్, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్
చెన్నై సూపర్ కింగ్స్: రాబిన్ ఉతప్ప, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా(కెప్టెన్), ఎంఎస్ ధోని(వికెట్ కీపర్), డ్వేన్ బ్రావో, క్రిస్ జోర్డాన్, మహేశ్ తీక్షణ, ముఖేష్ చౌదరి