CSK vs PBKS: ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. సీఎస్కే ముందుగా బ్యాటింగ్ చేయనుంది. సీఎస్కే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 4 పాయింట్లతో 1ద స్థానంలో ఉండగా.. పంజాబ్ కింగ్స్ 11 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ పంజాబ్ కు చాలా ముఖ్యమైనది. అయితే సీఎస్కే తన ప్రతిష్టను కాపాడుకోవడానికి రంగంలోకి దిగింది. ప్లేఆఫ్ రేసు నుంచి సీఎస్కే ప్రయాణం దాదాపు ముగిసింది. టాస్ అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడిన మాటలను బట్టి చూస్తే వేలుకు గాయం కారణంగా మ్యాక్స్‌వెల్ సీజన్ లోని మిగిలిన మ్యాచ్‌లన్నింటికి దూరమయ్యే అవకాశం ఉంది.

తుది జట్లు ఇవే..
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): షేక్ రషీద్, ఆయుష్ మాత్రే, సామ్ కుర్రాన్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రీవిస్, శివమ్ దూబే, దీపక్ హుడా, MS ధోని (వికెట్ కీపర్/కెప్టెన్), నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతిషా పతిరానా
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాన్ష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, మార్కో జాన్సెన్, అజ్మతుల్లా ఉమర్జాయ్, సూర్యాంశ్ షెడ్జ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్
చెన్నై సూపర్ కింగ్స్ ఇంపాక్ట్ సబ్స్: అన్షుల్ కాంబోజ్, రవిచంద్రన్ అశ్విన్, కమలేష్ నాగర్కోటి, రామకృష్ణ ఘోష్, జామీ ఓవర్టన్
పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ సబ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ముషీర్ ఖాన్, విజయ్‌కుమార్ వైషాక్, జేవియర్ బార్ట్‌లెట్, ప్రవీణ్ దూబే