Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Punjab Kings: ప్రియాంశ్ ఐపీఎల్ ఛాన్స్.. ఆ 8 బంతులే కారణం!!

ఐపీఎల్ 2025 తాజాగా జరిగిన మ్యాచులో ఫాస్టెస్ట్ సెంచరీ హీరోగా అవతరించాడు ప్రియాంశ్ ఆర్య. సీఎస్కేపై కేవలం 39 బంతుల్లోనే సెంచరీ బాది తన జట్టు మంచి స్కోరు సాధించేలా చేశాడు. వరుసగా వికెట్లు పడిపోతున్నా.. ఆత్మవిశ్వాసంతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడుతూ విజయంలో కీలకంగా వ్యవహరించాడు.

దీంతో మ్యాచ్ ముగిశాక క్రికెట్ అభిమానులు, మాజీలు.. ప్రియాంశ్ ఆర్యపై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే పంజాబ్ సహాయక కోచ్ బ్రాడ్ హడిన్.. ప్రియాంశ్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు. ఐపీఎల్ మొదలవ్వడానికి ముందు అతడు కేవలం 8 బంతులే నెట్స్ లో ప్రాక్టీస్ చేసినట్లు గుర్తు చేసుకున్నాడు. అలానే ప్రియాంశ్ చిన్ననాటి కోచ్ సంజయ్ భరద్వాజ్ కూడా.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

అదొక్కటి చాలు.. ఫిక్స్ అయ్యాం..
"ఐపీఎల్‌ ముందు ప్రాక్టీస్ గేమ్ లో కేవలం ఎనిమిది బంతులే అతడు ఆడాడు. అది చూడగానే.. అతడికి తొలి అవకాశం ఇవ్వాలని మేం నిర్ణయించుకున్నాం. '' అని బ్రాడ్ హడిన్ అన్నాడు.

నమస్కారం సార్..
"మీతో మాట్లాడే ముందే ప్రియాంశ్ నాకు ఫోన్ చేశాడు. 'నమస్కారం సర్' అని చెప్పి.. ఎలా ఆడాను సార్ అని అడిగాడు. ఏమైందని తిరిగి అడిగాను. నేదేం లేదు సార్. అంతా దేవుడే చేశాడు. అని నవ్వాడు. అంటే నేనెప్పుడు దేవుడే చేస్తాడని చెబుతుంటాను. అదే తిరిగి చెప్పాడు. అలానే నాకు ఉదయం 7.30 గంటలకు కాల్ చేశాడు. మ్యాచ్‌ ముగిశాక తర్వాత 2-3 గంటలకు నిద్ర పోయినట్లు చెప్పాడు. ఎప్పుడూ ఇలానే ఉంటాడు. ఎంతో వినయంగా, గౌరవంగా ఉంటాడు.'' అని సంజయ్‌ చెప్పుకొచ్చాడు.

priyansh Arya played only eight balls in practice match before IPL says coach Haddin
Story first published: Wednesday, April 9, 2025, 14:20 [IST]
Other articles published on Apr 9, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+