CSK vs PBKS: కీలక మార్పులతో బరిలోకి చెన్నై, పంజాబ్.. రెండు జట్ల ప్లేయింగ్ 11 ఇదే!

ఐపీఎల్ 2022లో నేడు మరో ఆసక్తిర పోరు జరగనుంది. రవీంద్ర జడేజా నేతృత్వంలోని చెన్నైసూపర్ కింగ్స్, మయాంక్ అగర్వాల్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. టోర్నీలో ఇప్పటివరకు బోణీ చేయని చెన్నైసూపర్ కింగ్స్ ఈ మ్యాచ్‌లో గెలవాలని పట్టుదలగా ఉంది. ఇక గత మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిన పంజాబ్ కింగ్స్ కూడా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. దీంతో ఇరు జట్ల ప్లేయింగ్ 11లో పలు మార్పులు ఖాయంగా కనిపిస్తోంది.

సీఎస్కే బ్యాటింగ్ యూనిల్ ఇదే
గత మ్యాచ్‌తో పోలిస్తే చెన్నైసూపర్ కింగ్స్ బ్యాటింగ్ యూనిట్‌లో పెదగా మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపించడం లేదు. ఓపెనర్లుగా రాబిన్ ఊతప్ప, రుతురాజ్ గైక్వాడ్ ఈ మ్యాచ్‌లోనూ బరిలోకి దిగనున్నారు. ఇక మూడో స్థానంలో ఆల్‌రౌండర్ మొయిన్ అలీ, నాల్గో స్థానంలో శివమ్ దూబే బ్యాటింగ్‌కు రానున్నారు. ఐదో స్థానంలో అంబటి రాయుడు, ఆరో స్థానంలో కెప్టెన్ రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేయనున్నారు. ఇక ఏడో స్థానంలో మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ చేయనున్నాడు.

బౌలర్లలో మార్పులు
బ్యాటింగ్‌లో ఎలాంటి మార్పులు లేనప్పటికీ బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో మాత్రం ఒక మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు ఇచ్చిన ముఖేష్ చౌదరీకి ఈ మ్యాచ్‌లో చోటు కష్టమే అని చెప్పుకోవాలి. అతని స్థానంలో అండర్ 19 హిరో రాజవర్ధన్ హంగర్గేకర్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక మిగతా బౌలర్లు డ్వైన్ ప్రిటోరియస్, డ్వేన్ బ్రావో, తుషార్ పాండే జట్టులో ఉండనున్నారు. సీఎస్కే జట్టులో ఆల్‌రౌండర్లుగా మొయిన్ అలీ, రవీంద్ర జడేజా వ్యవహరించనున్నారు.

పంజాబ్ బ్యాటింగ్‌లో మార్పు
ఈ మ్యాచ్‌కు పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఒక మార్పు జరిగే అవకాశం ఉంది. ఇటీవల జట్టులో చేరిన ఆ జట్టు స్టార్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో ఈ మ్యాచ్ ఆడడం ఖాయంగా కనిపిస్తోంది. బెయిర్‌స్టో కనుక జట్టులోకి వస్తే అంచానలకు తగ్గట్టుగా రాణించలేకపోతున్న లివింగ్‌స్టోన్‌ను తుది జట్టు నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయి. మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్ ఓపెనర్లుగా కొనసాగనుండగా బెయిర్‌స్టో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు. నాల్గో స్థానంలో భానుక రాజపక్స, ఐదో స్థానలో రాజ్ బవా, ఆరో స్థానంలో షారూక్ ఖాన్, ఏడో స్థానంలో హర్‌ప్రీత్ బ్రార్ బ్యాటింగ్ చేయనున్నారు.

బౌలింగ్ డిపార్ట్‌మెంట్ ఇదే
అయితే పంజాబ్ బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఎటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఓడియన్ స్మిత్, రాహుల్ చాహర్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్ భారాన్ని మోయనున్నారు.

తుది జట్లు (అంచనా)
చెన్నైసూపర్ కింగ్స్: రాబిన్ ఊతప్ప, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, శివమ్ దూబే, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా (కెప్టెన్), మహేంద్ర సింగ్ ధోని (వికెట్ కీపర్), డ్వైన్ ప్రిటోరియస్, డ్వేన్ బ్రావో, తుషార్ పాండే, రాజవర్ధన్ హంగర్గేకర్.
పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్, బెయిర్‌స్టో, భానుక రాజపక్స, రాజ్ బవా, షారూక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, ఓడియన్ స్మిత్, రాహుల్ చాహర్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications