Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MS Dhoni తొండాట: ఇట్స్ నాట్ ఫెయిర్ బాస్, అవుట్ అయినా క్రీజ్‌ను వదలక..థర్డ్ అంపైర్ జోక్యం

CSK vs PBKS: MS Dhoni Not Playing A Fair Game Huge Trolls From Netizens.

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ పరాజయాలకు బ్రేక్ పడట్లేదు. మూడు మ్యాచ్‌లను ఆడినా ఇంకా బోణీ కొట్టనే లేదు. ఇక మీదట బోణీ కొడుతుందన్న ఆశ కూడా లేదు. ఈ సీజన్‌లో ముచ్చటగా మూడో ఓటమిని మూటగట్టుకుంది. హ్యాట్రిక్ పరాజయాలను చవి చూసింది. టైటిల్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగినప్పటికీ.. ఆ స్థాయి ఆటతీరును ప్రదర్శించట్లేదు. తొలి మ్యాచ్‌లో కోల్‌కత నైట్ రైడర్స్..రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, ఇప్పుడు తాజాగా పంజాబ్ కింగ్స్ చేతుల్లో పరాభవాన్ని చవి చూసింది.

తొలి మూడు మ్యాచ్‌ల్లో ఓడటం..

తొలి మూడు మ్యాచ్‌ల్లో ఓడటం..

ఇప్పుడూ అదే జరుగుతోంది. మూడు వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి దిగజారిందీ టీమ్. బౌలింగ్ బాగుంటే..బ్యాటర్లు- బ్యాటర్లు రాణించిన మ్యాచ్‌లో బౌలర్లు విఫలం కావడం అప్పట్లో కనిపించింది. ఇప్పుడు మళ్లీ 2020 నాటి సీన్ రిపీట్ అవుతోంది. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తొలి మూడు మ్యాచ్‌లను ఓడిపోవడం ఇదే తొలిసారి. గతంలో ఇలాంటి సందర్భం ఎప్పుడూ ఎదురు కాలేదు. తొలి మ్యాచ్‌లో ఓడినప్పటికీ.. ఆ తరువాత పుంజుకోవడం, పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకిన రోజులు ఉన్నాయి.

జట్టులో ఫస్ట్రేషన్..

జట్టులో ఫస్ట్రేషన్..

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌.. చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లల్లో నెలకొన్న ఫస్ట్రేషన్‌కు అద్దం పట్టింది. 36 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయిన కష్టాల్లో పడటం.. క్రీజ్‌లో ఉన్న ప్లేయర్లను విపరీతమైన ఒత్తిడికి గురి చేసింది. పొరపాట్లు చేసేలా ప్రేరేపించింది. ఒక దశలో మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ సైతం సహనం కోల్పోయినట్టు కనింపించింది. అవుట్ అయినప్పటికీ.. క్రీజ్‌ను వదలడానికి ధోనీ ఇష్టపడలేదంటే.. ఆ ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

 18వ ఓవర్‌లో..

18వ ఓవర్‌లో..

18వ ఓవర్ తొలి బంతికి ధోనీ అవుట్ అయిన విషయం తెలిసిందే. రాహుల్ చాహర్ వేసిన బంతిని ఫైన్ లెగ్ దిశగా ఆడబోయి టైమింగ్ మిస్ అయ్యాడు ధోనీ. ఆ బంతి ఎడ్జ్ తీసుకుని నేరుగా వికెట్ కీపర్ జితేష్ శర్మ చేతుల్లో వాలింది. ఫీల్డ్ అంపైర్ అవుట్ అయినట్టు ప్రకటించినప్పటికీ ధోనీ క్రీజ్‌ను వదల్లేదు. థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని ప్రకటించేంత వరకూ అక్కడే నిల్చుండిపోయాడు. అవుట్ అయినట్టు థర్డ్ అంపైర్ ప్రకటించిన తరువాతే ధోనీ పెవిలియన్ దారి పట్టాడు. 28 బంతుల్లో 23 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మూడు మ్యాచ్‌లల్లో అతను అవుట్ కావడం ఇదే తొలిసారి.

ధోనీ వైఖరి పట్ల..

ధోనీ వైఖరి పట్ల..

ధోనీ వైఖరి పట్ల నెటిజన్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఫెయిర్ గేమ్ కాదంటూ కామెంట్స్ చేశారు. ఫెయిర్ గేమ్ విషయంలో ఎప్పుడూ పాజిటివ్‌గా వ్యవహరించే ధోనీ తొలిసారిగా ఇలా స్పందించడం సరికాదని వ్యాఖ్యానించారు. ధోనీ వైఖరి- చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టులో నెలకొన్న ఫస్ట్రేషన్‌కు అద్దం పడుతోందని, గెలుపోటములను సమానంగా తీసుకోవాలని సూచించారు. ఓడినా, గెలిచినా ఫెయిర్ గేమ్ ఆడాల్సి ఉంటుందని సలహా ఇచ్చారు.

Story first published: Monday, April 4, 2022, 10:54 [IST]
Other articles published on Apr 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+