Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శ్రేయస్ అయ్యర్ అదిరిపోయే కౌంటర్.. ప్రత్యర్థికి చుక్కలే!

ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్న ఆసక్తికర పోరుకు చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికైంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదట బౌలింగ్ ఎంచుకోగా.. రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని సీఎస్‌కే జట్టు మొదట బ్యాటింగ్‌కు దిగనుంది.

పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచిన అనంతరం కీలక వ్యాఖ్యలు చేశాడు. పిచ్ తాజాగా కనిపిస్తోందని, అందుకే మొదట బౌలింగ్ చేసి ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయాలనుకుంటున్నట్లు శ్రేయస్ తెలిపాడు. తన గాయం గురించి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ప్రస్తుతం తన చెయ్యి కూడా "ఫ్రెష్‌"గానే ఉందని నవ్వుతూ సమాధానమిచ్చాడు. గత సీజన్‌లో తాను అనుసరించిన దూకుడు వైఖరినే ఈ ఏడాది కూడా కొనసాగిస్తానని, మైదానంలో ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండటానికే మొగ్గు చూపుతానని స్పష్టం చేశాడు. పంజాబ్ జట్టు గత మ్యాచ్‌లో ఆడిన తుది జట్టుతోనే ఈ పోరులోనూ బరిలోకి దిగుతోంది.

CSK vs PBKS IPL 2026 Punjab Kings Won Toss Opt to Bowl vs CSK Shreyas Iyer Gives Update on His Injury

సీఎస్‌కే వ్యూహం - ఓపెనర్లుగా సంజు శాంసన్, రుతురాజ్
టాస్ ఓడిపోయినప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. టాస్ సమయంలో స్టేడియంలోని సీఎస్కే ఫ్యాన్స్ కేకలతో స్టేడియం హోరెత్తిపోయింది. పిచ్‌లో పెద్దగా మార్పులు ఉండవని, ఏప్రిల్ ఆరంభం కావడంతో మంచు ప్రభావం కూడా ఉండకపోవచ్చని రుతురాజ్ అభిప్రాయపడ్డాడు. గౌహతిలో జరిగిన గత మ్యాచ్ ఓటమిని మరిచిపోయి, ఈ మ్యాచ్‌పైనే పూర్తి దృష్టి సారించామన్నాడు. చెన్నై ఫ్రాంచైజీ విజయాల్లో టాప్ ఆర్డర్ ఎప్పుడూ కీలకమని, అందుకే తాను, సంజు శాంసన్ కలిసి ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నట్లు తెలిపాడు. ఈ మ్యాచ్ కోసం మ్యాట్ షార్ట్ స్థానంలో ప్రశాంత్ వీర్‌ను జట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించాడు.

తుది జట్లు (Playing XI):

పంజాబ్ కింగ్స్ (PBKS):

ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (కీపర్), కూపర్ కాన్లీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, వైశాఖ్ విజయ్‌కుమార్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.

చెన్నై సూపర్ కింగ్స్ (CSK):
సంజు శాంసన్ (కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్, నూర్ అహ్మద్, మ్యాట్ హెన్రీ, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్.

Story first published: Friday, April 3, 2026, 19:26 [IST]
Other articles published on Apr 3, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+