ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ మంచి ప్రదర్శన చేస్తోంది. ఆడిన మూడు మ్యాచుల్లో ఒకటి మాత్రమే ఓడిపోయింది. ఆ జట్టును కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సమర్థవంతంగా జట్టును ముందుకు తీసుకెళ్తున్నాడు. బ్యాట్ తోనూ ఝళిపించి జట్టు విజయంలో కీలకంగా నిలుస్తున్నాడు. ఇప్పటివరకు 97,52, 10 పరుగులు చేశాడు. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడేందుకు సిద్ధమయ్యాడు. ఈ సందర్భంగా తాను చివరిసారిగా ఏడ్చిన సంఘటనను గుర్తు చేసుకున్నాడు.
అప్పుడే ఏడ్చా.. షాక్ అయ్యా..
'చివరిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో ఏడ్చాను. అప్పుడు తొలి ప్రాక్టీస్ సెషన్ ఒకటే ఏడుస్తూనే ఉన్నా. ఎందుకంటే తొలి ప్రాక్టీస్ సెషన్ లో నెట్స్ లో నేను సరిగ్గా బాగా ఆడలేకపోయాను. ప్రాక్టీస్ కోసం ఎక్స్ ట్రా టైమ్ కూడా దొరకలేదు..దీంతో నాపై నాకే చాలా కోపం వచ్చేసింది. అందుకే ఏడ్చాను. సాధారణంగా నేను అంత ఈజీగా ఏడవను. కానీ అలా ఏడవటం చూసి నాకు నేనే షాక్ అయ్యాను' అని అయ్యర్ చెప్పుకొచ్చాడు.

కష్టంగా ఉంటుంది..
ఛాంపియన్స్ ట్రోఫీ కన్నా ముందు ఇంగ్లాండ్ హోం సిరీస్ లోనూ మంచి ప్రదర్శన చేశాడు శ్రేయస్ అయ్యర్. దీంతో అదే ఫ్లో ఛాంపియన్స్ ట్రోఫీలోనూ కొనసాగుతుందని తాను భావించినట్లు తెలిపాడు. కానీ దుబాయ్ లో వికెట్లు డిఫరెంట్ గా ఉన్నాయని చెప్పాడు. "తొలి రోజు పరిస్థితులకు అలవాటు పడటం కాస్త కష్టంగా ఉంటుంది. కాబట్టి ప్రాక్టీస్ అయిపోగానే.. ఇంకాస్త ఎక్స్ ట్రా ప్రాక్టీస్ టైమ్ కావాలని కోరుకున్నాను. కానీ అది జరగలేదు. అందుకే అప్పుడు బాగా కోపం వచ్చింది. ఏడ్చాను." అని పేర్కొన్నాడు అయ్యర్.
రెండో ఆటగాడిగా ఘనత..
ఇంగ్లాండ్ హోమ్ సిరీస్ లోని మూడు వన్డేల్లో కలిపి 60.33 సగటు, 123.12 స్టైక్ రేట్ తో 181 పరుగులు చేశాడు శ్రేయస్. ఆ సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అందులో రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. అప్పుడు అతడి బెస్ట్ స్కోర్ 78. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ భారత్ తరఫున సెకండ్ హయెస్ట్ రన్ స్కోరర్ గా నిలిచాడు శ్రేయస్. ఐదు మ్యాచుల్లో 48.0 యావరేజ్ తో 243 పరుగులు చేశాడు. అందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఇప్పుడు ఐపీఎల్ మూడు మ్యాచుల్లో కలిపి 206కు పైగా స్ట్రైక్ రేట్ తో, 159 సగటుతో 159 పరుగులు చేశాడు. అందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతడి బెస్ట్ స్కోర్ 97 నాటౌట్.