For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డెవాల్డ్ బ్రెవిస్ విన్యాసం - సీఎస్కే ఫ్యాన్స్ కళ్లు చెదిరే! (వీడియో)

Dewald Brevis Catch: ఐపీఎల్ 2025 తాజా మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్‌ కింగ్స్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచులో అద్భుత విన్యాసం చోటు చేసుకుంది. సీఎస్కే ప్లేయర్, జూనియర్ ఏబీడీ డెవాల్డ్ బ్రెవిస్ గాలిలో విన్యాసాలు చేస్తూ అద్భుతమైన క్యాచుతో క్రికెట్ అభిమానులు అలరించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఈ సీజన్‌లో ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడింది. అయినప్పటికీ ఈ మ్యాచులో డెవాల్డ్ బ్రెవిస్ అద్భుతం చేశాడు. జట్టు వరుస ఓటములతో నిరాశలో మునిగిపోయిన అభిమానులకు... తన అద్భుత ప్రదర్శనతో ఉత్సాహాన్ని నింపాడు బ్రెవిస్. పంజాబ్ జట్టు 180 పరుగుల దగ్గర ఉన్న సమయంలో.. జడేజా బౌలింగ్‌లో పంజాబ్‌ బ్యాటర్‌ శశాంక్‌ సింగ్‌ భారీ షాట్‌ బాదాడు. కానీ బౌండరీ లైన్‌ దగ్గర ఉన్న డెవాల్డ్‌ బ్రెవిస్‌ సూపర్ ఫీట్ చేశాడు. రెండుసార్లు బౌండరీ లైన్‌ దాటి మరీ, బాల్ ను గాల్లోకి ఎగరవేస్తూ క్యాచ్‌ను ఒడిసిపట్టిన విధానం చూస్తే నోరు తెరవాల్సిందే. అంతలా గాల్లోకి ఎగిరి మరీ సూపర్ ఫీట్ చేశాడు డెవాల్డ్ బ్రెవిస్. ఐపీఎల్‌ 2025 సీజన్ లో నమోదైన అద్భుతమైన క్యాచ్‌ల్లో ఇదొకటి. దీంతో సిక్స్‌ పక్కా అని అనుకున్న సమయంలో.. బంతిని బ్రెవిస్ క్యాచ్‌ పట్టుకోవడంతో శశాంక్ పెవిలియన్ చేరాడు.

CSK VS PBKS Dewald Brevis stunning Catch on the boundary line video goes viral

ఇక బ్రెవిస్ పట్టిన క్యాచ్‌ చూసిన స్టేడియంలోని సీఎస్కే, క్రికెట్ ఫ్యాన్స్‌ మొత్తం కేరింతలతో స్టేడియాన్ని హోరెత్తించారు. ఇప్పుడు బ్రెవిస్‌ క్యాచ్‌ పట్టిన అద్భుత దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు.. కళ్లు చెదిరిపోయాయి వర్మ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.

కాగా, ఈ మ్యాచులో మొదట చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 19.2 ఓవర్లలో 190 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఆ తర్వాత పంజాబ్‌ కింగ్స్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.

Story first published: Thursday, May 1, 2025, 10:13 [IST]
Other articles published on May 1, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+