Shreyas Iyer: చెన్నైపై 10 ఏళ్ల తర్వాత అలా..
Shreyas Iyer: ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. పంజాబ్ కింగ్స్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఈ విజయాన్ని అందుకుంది. విజయంలో చాహల్ (4/32)తో పాటు శ్రేయస్ అయ్యర్ (72; 41 బంతుల్లో 5×4, 4×6), ప్రభ్‌సిమ్రన్ (54; 36 బంతుల్లో 5×4, 3×6) కీలకంగా వ్యవహరించారు. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
చెపాక్ లో దూకుడుగా..
అయితే సాధారణంగా చెపాక్ స్టేడియంలో 191 పరుగుల ఛేదన కష్టమే అయినా.. పంజాబ్ బ్యాటర్లు ప్రభ్‌సిమ్రన్, ప్రియాంశ్ ఆర్య, మంచి మెరుపులతో బరమైన పునాది వేశారు. వారికి సహకరిస్తూ మరో ఎండ్ లో వారితో కలిసి శ్రేయస్ అయ్యర్ నిలకడగా ఆడడంతో పంజాబ్ కింగ్స్ కు ఎదురు లేకుండా పోయింది. శ్రేయస్ దూకుడు కొనసాగించడంతో చెన్నై జట్టుకు చెపాక్ లో ఇబ్బందులు తప్పలేదు. ఈ క్రమంలోనే అతడు మొదటి 20 బంతుల్లో 25 పరుగులు చేసిన అతడు.. ఆ తర్వాత గేర్ మార్చి మరింత దూకుడుగా ఆడాడు. 32 బంతుల్లోనే అర్ధ శతకం బాదాడు. మొత్తంగా 5 ఫోర్లు, 6 సిక్సుల సాయంతో 72 పరుగులు హాఫ్ సెంచరీ చేశాడు.

10 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలా..
శ్రేయస్ అయ్యర్ కు సీఎస్కేపై ఇది రెండు హాఫ్ సెంచరీ కావడం విశేషం. చివరి సారిగా అతడు సీఎస్కేపై 2015లో అర్ధ శతకం బాదాడు. అంటే 10 ఏళ్ల తర్వాత మళ్లీ అతడికి చెన్నై జట్టుపై ఫిఫ్టీ స్కోరు చేసే అవకాశం వచ్చింది. ఇకపోతే ప్రస్తుత సీజన్ లోనూ అతడు బయటి స్టేడియాల్లో మంచి ఫామ్ లో ఉన్నాడు. గత ఆరు మ్యాచుల్లో 4 హాఫ్ సెంచరీలు బాదేశాడు. మొత్తంగా ఈ సీజన్ లో 10 మ్యాచులు ఆడిన శ్రేయస్ అయ్యర్.. 51.43 సగటు, 180 స్ట్రైక్ రేటుతో 360 పరుగులు చేశాడు. అందులో 23 ఫోర్లు, 25 సిక్సులు ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications