CSK vs MI: రుతురాజ్ హాఫ్ సెంచరీ.. బ్రావో విధ్వంసం! ముంబై ముందు టఫ్ టార్గెట్!

దుబాయ్: 1-1, 2-2, 7-3.. ఇది చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ల పతనం. మధ్యలో కీలక ప్లేయర్ అంబటి రాయుడు(0) సీరియస్ ఇంజ్యూరీతో రిటైర్ట్ హర్ట్. ఆ తర్వాత ఆదుకుంటారనుకున్న సురేశ్ రైనా(4), మహేంద్ర సింగ్ ధోనీ(3) చేతులెత్తేయడంతో చెన్నై 24 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. ముంబై బౌలర్ల జోరు ముందు చెన్నై 100 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. అద్భుతం జరిగితే తప్పా ఈ మ్యాచ్‌లో చెన్నై నిలబడటం కష్టమనిపిచింది. కానీ యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(58 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 88 నాటౌట్) ఆ అద్భుతాన్ని చేసి చూపించాడు.

స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(26)తో కలిసి జట్టును ఆదుకున్నాడు. ఈ ఇద్దరి 81 పరుగుల క్లాస్ ఇన్నింగ్స్‌కు డ్వేన్ బ్రావో (8 బంతుల్లో 3 సిక్సర్లతో 23)మెరుపులు మెరిపించడంతో ముంబై ముందు చెన్నై 157 పరుగులు పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ మిల్నే, జస్‌ప్రీత్ బుమ్రా రెండేసి వికెట్లు తీశారు.

ఆదిలోనే షాక్..

ఆదిలోనే షాక్..

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఫస్ట్ ఓవర్‌లోనే ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్(0) సిల్వర్ డక్‌గా వెనుదిరగ్గా.. రెండో ఓవర్‌లో మొయిన్ అలీ(0), మూడో ఓవర్‌లో సురేశ్ రైనా(4) పేలవ షాట్లతో పెవిలియన్ చేరారు. ఫాఫ్ డుప్లెసిస్‌ను ట్రెంట్ బౌల్ట్ తన స్వింగ్‌తో బోల్తా కొట్టించగా.. మొయిన్ అలీని ఆడమ్ మిల్నే పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత రాయుడు(0) రిటైర్ట్ హర్ట్ అవ్వగా.. బౌల్ట్ బౌలింగ్‌లో రైనా అనవసర షాట్‌తో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో సీఎస్‌కే 7 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ప్చ్.. ధోనీ విఫలం..

ప్చ్.. ధోనీ విఫలం..

ఈ పరిస్థితుల్లో జట్టును ఆదుకునేందుకు ధోనీ రంగంలోకి దిగగా.. యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ బౌండరీలతో స్కోర్ వేగాన్ని పెంచే ప్రయత్నం చేశాడు. గైక్వాడ్ ఓవర్‌కో బౌండరీ బాదగా.. మరోవైపు ధోనీ(3) మిల్నే బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో చెన్నై పవర్ ప్లే ముగిసే సరికి 4 వికెట్లకు 24 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజాతో గైక్వాడ్ ఆచితూచి ఆడాడు. ఈ ఇద్దరు వికెట్ కాపాడుకునే ప్రయత్నం చేయడంతో చెన్నై స్కోర్ బోర్డు నిదానంగా కదిలింది. చాహర్ వేసిన 9వ ఓవర్‌లో గైక్వాడ్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను కీపర్ డికాక్ నేలపాలు చేశాడు.ఇక కృనాల్ వేసిన మరుసటి ఓవర్‌లో క్విక్ సింగిల్స్, డబుల్స్‌‌తో 9 పరుగులు రావడంతో చెన్నై 10 ఓవర్లు ముగిసే సరికి కేవలం 44 పరుగులు మాత్రమే చేసింది.

రుతురాజ్ హాఫ్ సెంచరీ..

రుతురాజ్ హాఫ్ సెంచరీ..

ఆ తర్వాత గేర్ మార్చిన రుతురాజ్.. కృనాల్ వేసిన 12వ ఓవర్‌లో దుమ్మురేపాడు. అతనికి జడేజా కూడా తోడవడంతో 18 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్ రెండో బంతిని గైక్వాడ్ భారీ సిక్సర్‌గా మలిచగా.. నాలుగో బంతిని జడేజా బౌండరీ తరలించాడు. ఇక చివరి బంతిని గైక్వాడ్ రివర్స్‌స్వీప్ షాట్‌తో మరో బౌండరీ రాబట్టడంతో ఈ ఓవర్ ఎక్స్‌పెన్సివ్‌గా మారింది. ఆ తర్వాత కూడా అదే జోరు కనబర్చిన ఈ జోడీ.. తెలివిగా బ్యాటింగ్ చేసింది. బుమ్రా, రాహుల్ చాహర్ బౌలింగ్‌లో రిస్కీ షాట్లు ఆడకుండా క్విక్ సింగిల్స్, డబుల్స్‌తో స్కోర్ బోర్డును పెంచే ప్రయత్నం చేసింది. ఇక పొలార్డ్ వేసిన 16వ ఓవర్‌లో రెండు బౌండరీలు బాదిన గైక్వాడ్..42 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బ్యాటింగ్ ప్రతికూలమైన పిచ్‌పై ఇంటర్నేషనల్ స్టార్ట్స్ తడబడిన వేళ రుతురాజ్ ఆకట్టుకున్నాడు. అతనికి ఇది ఆరో ఐపీఎల్ హాఫ్ సెంచరీ.

బ్రావో విధ్వంసం..

బ్రావో విధ్వంసం..

ఇక క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని బుమ్రా విడదీసాడు. అతను వేసిన 17వ ఓవర్‌లో రుతురాజ్ భారీ సిక్సర్ బాదగా.. ఆ తర్వాత జడేజా(26) భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో ఐదో వికెట్‌కు నమోదైన 81 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డ్వేన్ బ్రావో తన సీపీఎల్ ఫామ్‌ను కొనసాగిస్తూ భారీ సిక్సర్లు బాదాడు. మిల్నే వేసిన 18వ ఓవర్ ఆఖరి బంతికి సిక్స్ బాది టచ్‌లోకి వచ్చిన బ్రావో.. బౌల్ట్ వేసిన 19వ ఓవర్‌లో మూడు సిక్స్‌లు బాదాడు. దాంతో చెన్నై ఆ ఓవర్‌లో 24 పరుగులు పిండుకుంది. ఇక చివరి ఓవర్‌లో బ్రావో ఔటైనప్పటికీ.. రుతురాజ్ 6, 4‌తో 15 రన్స్ పిండుకోవడంతో చెన్నై గౌరవప్రదమైన స్కోర్ చేసింది.

ఐసీసీ టీ-20 ప్రపంచ కప్ 2021 ప్రిడిక్షన్
Match 22 - October 28 2021, 07:30 PM
ఆస్ట్రేలియా
శ్రీలంక
Predict Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, September 19, 2021, 21:32 [IST]
Other articles published on Sep 19, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X