నీతా అంబానీ.. దాతృత్వ, సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ఇతర విషయాలకు సంబంధించి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఓవైపు రిలయన్స్ ఫౌండేషన్ బాధ్యతలు మోస్తూనే.. మరోవైపు ఫ్రాంఛైజీ క్రికెట్ వ్యవహారాలను చూసుకుంటూ ఉంటారు. అయితే తాజాగా సీఎస్కే - ముంబయి ఇండియన్స్ మ్యాచుకు హాజరైన ఆమె.. ధోనీ దెబ్బకు అబ్బ అంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీరూ చూసేయండి..
ధోనీ.. ఈ పేరుకున్న క్రేజ్ గురించి ఎంత చెప్పిన తక్కువే. ఆ పేరు వింటేనే క్రికెట్ అభిమానులు ఉప్పొంగిపోతారు. ఇతర క్రికెటర్లు సలామ్ కొడతారు. అదే ధోనీ మైదానంలో బ్యాట్ పడితే.. ప్రేక్షకులకి పూనకాలే. మహీ ఆడేది రెండు, మూడు బంతులే అయినా.. క్రీజులోకి ఎంట్రీ ఇవ్వగానే అతడి నామస్మరణతో స్టేడియాన్ని దద్దరిల్లేలా చేస్తారు. ధోనీ.. ధోనీ అంటూ నినాదాలతో హోరెత్తిస్తారు. ఇప్పటికే ఎన్నో సార్లు సౌండ్ లెవల్స్ రికార్డులు కూడా బ్రేకై ఆ విషయం రుజువైంది.

తాజాగా ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ముంబయి ఇండియన్స్ తో జరిగిన మ్యాచులోనూ ఇదే జరిగింది. ఆఖర్లో జడేజా ఔట్ అయ్యాక.. 19వ ఓవర్లో నెం.8వ స్థానంలో వచ్చాడు ధోనీ. రెండు డాట్ బాల్స్ ఆడి వెనుదిరిగాడు. కానీ అతడు మైదానంలోకి ఎంట్రీ ఇవ్వగానే మోత మోగిపోయింది. ఫ్యాన్స్ చప్పట్లు, కేరింతలు, అరుపులతో షేక్ ఆడించారు. తలా ఎంట్రీకి అక్కడే బౌండరీ లైన్ వద్ద ఉన్న ముంబయి ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీ ఆ సౌండ్ ను తట్టుకోలేకపోయింది. ఆమె ధోనీ నామస్మరణతో వచ్చిన అరుపులను వినలకే గట్టిగా చెవులు కూడా మూసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషళ్ మీడియాలో వైరల్ గా మారింది. 'ధోనీ దెబ్బకు నీతా అంబానీ అబ్బ, నీతా అంబానీ చెవులకు చిల్లు పడిందిరోయ్, తలా అంటే ఆ మాత్రం ఉంటది మరి'.. అంటూ ఫ్యాన్స్ రకరకాల కామెంట్లు పోస్ట్లు పెడుతున్నారు.