Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చెన్నైపై ముంబై అలవోక విజయం: ప్లేఆఫ్‌ రేసులో మరింత ముందుకు

IPL 2019 : Mumbai Indians Defeat Chennai Super Kings By 46 Runs || Oneindia Telugu
MI

హైదరాబాద్: చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 156 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 17.4 ఓవర్లకు గాను 109 పరుగులకే కుప్పకూలింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

చెన్నై బ్యాట్స్‌మెన్‌లో ఓపెనర్‌ మురళీ విజయ్‌ 35 బంతుల్లో 38(3 ఫోర్లు, సిక్స్)తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాట్స్‌మెన్ షేన్ వాట్సన్(8), సురేశ్ రైనా(2,) అంబటి రాయుడు (0), కేదార్ జాదవ్(6) సింగిల్ డిజిట్‌కే పరిమితం కాగా బ్రావో(20), శాంట్నర్‌(22) ఫరవాలేదనిపించారు. ముంబై బౌలర్లలో మలింగ నాలుగు వికెట్లు, కృనాల్‌, బుమ్రా రెండేసి వికెట్లు తీశారు. అంకుర్ రాయ్‌, హార్దిక్‌ పాండ్యా చెరో వికెట్‌ తీశారు.


చెన్నై టార్గెట్ 156
అంతకముందు రోహిత్ శర్మ 48 బంతుల్లో 67(6 ఫోర్లు, 3 సిక్సులు)తో రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్‌కు 156 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై 24 పరుగుల వద్ద ఓపెనర్ క్వింటన్ డికాక్(15) వికెట్‌ను కోల్పోయింది.

1
45920

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై 24 పరుగుల వద్ద ఓపెనర్ క్వింటన్ డికాక్(15) వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఎవిన్ లూయిస్‌తో కలిసి కెప్టెన్ రోహిత్ శర్మ మరో వికెట్ కోల్పోకుండా ఆడుతూనే స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు.

ఈ క్రమంలో జట్టు స్కోరు 99 పరుగుల వద్ద లూయిస్ (32) ఔటయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే కృనాల్ పాండ్యా (1) కూడా పెవిలియన్‌కు చేరడంతో ముంబై పరుగుల వేగం తగ్గింది. ఒకానొక దశలో స్కోరు 200 పరుగులు దాటుతుందని అంతా భావించారు. రోహిత్ శర్మ ఔట్ కావడంతో స్కోరుబోర్డు నెమ్మదించింది.

ఈ మ్యాచ్‌లో 48 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 6 ఫోర్లు, మూడు సిక్సర్లతో 67 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో పొలార్డ్ నిరాశపరిచాడు. చివర్లో హార్దిక్ పాండ్యా ఓ సిక్సర్, ఫోర్‌తో 23 పరుగులు చేయడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై
అంతకముందు ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ సురేశ్ రైనా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. జ్వరం కారణంగా ఈ మ్యాచ్‌కి రెగ్యులర్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని దూరమయ్యాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు మూడు మార్పులతో ఈ మ్యాచ్ బరిలో దిగింది.

ధోనీ, రవీంద్ర జడేజా, డుప్లెసిస్‌ల స్థానంలో ధృవ్ షోరే, మురళీ విజయ్, మిచెల్ శాంట్నర్‌లు తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. మరోవైపు ఈ మ్యాచ్‌లో ముంబై రెండు మార్పులు చేసింది. బెన్‌ కట్టింగ్, మయాంక్ మార్కండే స్థానంలో ఎవిన్ లూయిస్, అంకుర్ రాయ్‌లను తీసుకన్నారు.

ధోని స్థానంలో సురేశ్ రైనా కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. మరోవైపు ఈ మ్యాచ్‌తో ముంబై ఇండియన్స్ తరుపున అంకుర్ రాయ్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌కి ముందు లసిత్ మలింగ చేతుల మీదగా యువ ఆటగాడు అంకుర్ రాయ్ ముంబై ఇండియన్స్ క్యాప్‌ని అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోని ఐపీఎల్ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది.

Story first published: Friday, April 26, 2019, 23:50 [IST]
Other articles published on Apr 26, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+