ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ చెరో ఐదోసార్లు టైటిల్ విజయం సాధించిన జట్లు. అయితే గతేడాది ఈ ఇరు జట్లూ గ్రూప్ స్టేజ్‌కే పరిమితమై.. తమ అభిమానులను నిరాశపరిచాయి.
అయితే తాజాగా ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా ఈ రెండో బడా జట్లు చెన్నై వేదికగా తలపడుతున్నాయి. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచిన సీఎస్కే జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్ కు దిగనుంది.
తెలుగోడు అరంగేట్రం
అయితే ఈ మ్యాచ్ ఓ తెలుగు ప్లేయర్ ఐపీఎల్ అరంగేట్రం చేస్తున్నాడు. అతడి పేరే సత్యనారాయణ రాజు. కాకినాడకు చెందిన సత్యనారాయణ రాజును ముంబై ఇండియన్స్ రూ. 30 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. మీడియం ఫాస్ట్ బౌలర్ అయిన రాజు.. ఆంధ్ర తరఫున 8 ఫస్ట్ క్లాస్, 7 లిస్ట్ ఏ, 7 టీ20లు ఆడి 33 వికెట్లు తీసాడు.

"మొదట బ్యాటింగ్ చేయడం మాకు మంచిదే. రెండు జట్లు జట్లు కూడా ఎన్నో ఘనతలు సాధించాయి. ఈ గేమ్ కచ్చితంగా మంచి మజానిస్తుందని చెప్పగలను. రికెల్టన్, జాక్స్, శాంట్నర్, బౌల్డ్ ఓవర్సీ ప్లేయర్స్." అని సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు.
"ఈ పిచ్ పై తొలి సారి ఆడుతున్నాం. కాబట్టి ఈ పిచ్ ఎలా ఉండబోతుందో నిజంగా చెప్పలేను. పరిస్థితులను అర్థం చేసుకుని, అందుకు తగ్గట్టుగా ఛేజ్ చేస్తాం. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా కనిపిస్తోంది. మేం బాగానే సన్నద్ధం అయ్యాం. మా యంగ్ వికెట్ కీపర్ (ధోనీ) కూడా క్యాంప్ కు ఈ సారి త్వరగానే వచ్చాడు. నూర్ ఎల్లిస్, రచిన్ రవీంద్ర, సామ్ కరణ్ ఓవర్సీస్ ఆటగాళ్లు." అని రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు.
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, రియాన్ రికెల్టన్(వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, నమన్ ధీర్, రాబిన్ మింజ్, మిచెల్ శాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, సత్యనారాయణ రాజు
ఇంపాక్ట్ ప్లేయర్ - విఘ్నేశ్, అశ్విని కుమార్, రాజ్ బావా, కార్బిన్ బోచ్, కర్ణ్ శర్మ
చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, దీపక్ హుడా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, సామ్ కర్రాన్, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, నాథన్ ఎల్లిస్, ఖలీల్ అహ్మద్
ఇంపాక్ట్ ప్లేయర్ - రాహుల్ త్రిపాఠి, కమ్లేశ్ నాగర్ కోటీ, విజయ్ శంకర్, జేమీ ఓవర్టన్, షేక్రషీద్.