అందుకే ఈ నిర్ణయం: రుతురాజ్ గైక్వాడ్
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా చెన్నైలోని ప్రతిష్టాత్మక ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ఉత్కంఠపోరు జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఏమాత్రం తడబడకుండా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గత కొన్ని రోజులుగా చెన్నైలో వర్ష సూచన ఉండటం, పిచ్ ఎక్కువ సమయం కవర్ల కింద ఉండటంతో తేమ ప్రభావం ఉంటుందని గైక్వాడ్ అంచనా వేశాడు. పగటిపూట జరిగే మ్యాచ్ కావడంతో పిచ్ స్వభావం మారుతుందని, అయితే ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేసి లక్ష్యాన్ని ఛేదించడమే తమ ప్రణాళిక అని రుతురాజ్ స్పష్టం చేశాడు. గత 8 మ్యాచ్‌లలో తమ జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉందని.. అదే జోరును కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.
లక్నో వ్యూహాలు
మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ.. తాము కూడా టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకునే వాళ్లమని వెల్లడించాడు. టోర్నీలో నిలకడగా రాణించడం తమకు అత్యంత ఆవశ్యకమని.. గత మ్యాచ్‌లలో విజయానికి చేరువగా వచ్చి ఓడిపోవడంపై రిషబ్ పంత్ అసహనం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే ప్రతి ప్లేయర్ మైదానంలో 200 శాతం శ్రమించాలని పిలుపునిచ్చాడు. జట్టులో రెండు కీలక మార్పులు చేసినట్లు రిషబ్ పంత్ తెలిపాడు. గాయం కారణంగా దూరమైన జోష్ ఇంగ్లిస్ తిరిగి జట్టులోకి రాగా.. మయాంక్ స్థానంలో పేసర్ అవేష్ ఖాన్‌ను తుదిజట్టులోకి తీసుకున్నట్లు తెలిపాడు.

తుది జట్లు ఇవే:
చెన్నై సూపర్ కింగ్స్: సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఉర్విల్ పటేల్, కార్తీక్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, జేమీ ఓవర్టన్, అఖీల్ హుస్సేన్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి.
లక్నో సూపర్ జెయింట్స్:
మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లిస్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్/కీపర్), ఐడెన్ మార్‌క్రమ్, అక్షత్ రఘువంశీ, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్, మహమ్మద్ షమీ, దిగ్వేష్ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications