Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK vs LSG: ఎంత ప‌నిచేశావు బ‌దోని.. నీ సిక్సు కోసం ఆమె త‌ల ప‌గల‌గొట్టావుగా! వీడియో వైర‌ల్‌

CSK vs LSG: Six hit by Ayush Badoni in 19th over hits female spectator head

ఐపీఎల్ 2022లో గురువారం జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నైసూప‌ర్ కింగ్స్‌పై ల‌క్నోసూప‌ర్ జెయింట్స్ ఘ‌న విజ‌యం సాధించింది. సీఎస్కే విసిరిన‌ 211 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని చేధించి మ‌రి ల‌క్నో విజ‌యం సాధించ‌డం గ‌మ‌నార్హం. అయితే ఈ క్ర‌మంలో ల‌క్నో బ్యాట‌ర్ ఆయుష్ బ‌దోని బాదిన ఓ సిక్స‌రు మైదానంలో మ్యాచ్ వీక్షిస్తున్న ఓ ప్రేక్ష‌కురాలు త‌ల‌కు బలంగా త‌గ‌ల‌డం ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

ప్రేక్ష‌కురాలి త‌ల‌కు బ‌లంగా త‌గిలిన బంతి

ప్రేక్ష‌కురాలి త‌ల‌కు బ‌లంగా త‌గిలిన బంతి

ల‌క్నోసూప‌ర్ జెయింట్స్‌, చెన్నైసూప‌ర్ కింగ్స్ మ్యాచ్ హోరాహోరిగా సాగుతుంది. మ్యాచ్‌లో ల‌క్నో గెల‌వాలంటే చివ‌రి రెండు ఓవ‌ర్ల‌లో 34 ప‌రుగులు చేయాలి. క్రీజులో ఆయుష్ బ‌దోని, ఎవిన్ లూయిస్ ఉన్నారు. ఈ స‌మ‌యంలో 19వ ఓవ‌ర్‌ను సీఎస్కే కెప్టెన్ ర‌వీంద్ర జ‌డేజా.. శివ‌మ్ దూబేకు ఇచ్చాడు. ఆ ఓవ‌ర్ తొలి బంతిని శివ‌మ్ దూబే ఆఫ్ సైడ్ మీదుగా షార్ట్ పిచ్ బాల్‌ వేయ‌గా.. దానిని ఆదోని డీప్ స్క్వేర్ లెగ్ దిశ‌గా భారీ సిక్స‌ర్ బాదాడు. అది కాస్త స్టాండ్స్‌లో మ్యాచ్ వీక్షిస్తున్న ఓ మ‌హిళ త‌ల‌కు బ‌లంగా త‌గిలింది.

ఆ మ‌హిళ సీఎస్కే అభిమాని

ఆ సిక్స‌ర్ త‌ల‌కు త‌గ‌ల‌డంతో స‌ద‌రు మ‌హిళ కాస్త నొప్పితో బాధ‌ప‌డింది. దీంతో ఆమె త‌న చేతుల‌ను త‌ల‌పైన పెట్టుకుని రుద్దుకుంది. ఆమెకు మ‌రో మ‌హిళ కూడా స‌హ‌క‌రించింది. ప‌క్క‌న ఉన్న ఇత‌రులు కూడా కాస్త ఉలిక్కిప‌డ్డారు. అయితే ఆమెకు పెద‌గా గాయం కాక‌పోవ‌డంతో అంతా ఊప‌రిపీల్చుకున్నారు. ఇక బంతి త‌గిలిన మ‌హిళ సీఎస్కే అభిమానిగా భావించ‌వ‌చ్చు. ఎందుకంటే ఆమె సీఎస్కే రంగైనా ఎల్లో దుస్తుల్లో ఉంది. మొత్తానికి ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేయ‌గా ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. ఎంత ప‌ని చేశావు బ‌దోని నీ సిక్సు కోసం ఆ మ‌హిళ త‌ల ప‌గ‌ల‌గొట్టావు క‌దా అని కొంద‌రు చ‌మ‌త్కారంగా వ్యాఖ్యానిస్తుంండ‌డం ఆస‌క్తిగా మారింది.

ల‌క్నో విజ‌యం

ల‌క్నో విజ‌యం

ఇక శివ‌మ్ దూబే వేసిన ఆ ఓవ‌ర్లో ఏకంగా 25 ప‌రుగులు రావ‌డంతో మ్యాచ్ కాస్త చెన్నై చేతుల్లో నుంచి ల‌క్నో చేతుల్లోకి జారిపోయింది. చివ‌రి ఓవ‌ర్లో కావాల్సిన 9 ప‌రుగులను లక్నో బ్యాట‌ర్లు తొలి 3 బంతుల్లోనే బాదేశారు. దీంతో టోర్నీలో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ తొలి విజ‌యం న‌మెదు చేసింది. ల‌క్నో విజయంలో క్వింట‌న్ డికాక్ (61), ఎవిన్ లూయిస్ (55*) కీల‌క పాత్ర పోషించారు. రాహుల్ 40 ప‌రుగుల‌తో రాణించాడు. చివ‌ర్లో బ‌దోని 9 బంతుల్లోనే 19 ప‌రుగులు బాది మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఎవిన్ లూయిస్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది.

స్కోర్లు:

చెన్నైసూప‌ర్ కింగ్స్‌: 210-7

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌: 211-4

Story first published: Friday, April 1, 2022, 15:19 [IST]
Other articles published on Apr 1, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+