Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSG vs CSK: కార్తీక్ శర్మ షో.. లక్నో ముందు కొండంత లక్ష్యం!

LSG vs CSK: ఐపీఎల్ 2026లో భాగంగా లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా సీఎస్కే, లక్నో జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్కే బ్యాటర్లు అదరగొట్టారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్కే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగుల భారీ స్కోరు సాధించింది. యువ బ్యాటర్ కార్తీక్ శర్మ అద్భుత హాఫ్ సెంచరీతో జట్టుకు పటిష్టమైన స్కోరును అందించాడు. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో ముందు సీఎస్కే 188 పరుగుల సవాలుతో కూడిన లక్ష్యాన్ని ఉంచింది.

ఆరంభంలో తడబడినా..
చెన్నై ఆరంభం ఆశించిన స్థాయిలో సాగలేదు. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కేవలం 13 పరుగులు చేసి ఆకాష్ మహరాజ్ సింగ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మరో ఓపెనర్ సంజు శాంసన్ (20) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. కొద్దిసేపటికే ఉర్విల్ పటేల్ (6) కూడా ఔట్ అవ్వడంతో చెన్నై 36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. లక్నో బౌలర్ ఆకాష్ మహరాజ్ సింగ్ తన స్పెల్‌తో చెన్నై టాపార్డర్‌ను దెబ్బతీశాడు.

CSK vs LSG Live Score Karthik Sharma Smashing 71 Helps CSK Post 187 5 Akash Singh Takes 3

కార్తీక్ శర్మ వీరవిహారం
కష్టాల్లో ఉన్న జట్టును కార్తీక్ శర్(71), డెవాల్డ్ బ్రెవిస్(25) ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు కీలకమైన 70 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. డెవాల్డ్ బ్రెవిస్ 16 బంతుల్లో 25 పరుగులు చేసి ఔటవ్వగా.. కార్తీక్ శర్మ మాత్రం లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తన ఐపీఎల్ కెరీర్‌లో రెండో అర్ధసెంచరీని సాధించిన కార్తీక్, కేవలం 42 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 71 పరుగులు చేసి జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు. చివరలో శివమ్ దూబే కూడా 16 బంతుల్లో 32 పరుగులతో మెరుపులు మెరిపించి అజేయంగా నిలవడంతో సీఎస్కే భారీ స్కోరు సాధించగలిగింది.

లక్నో బౌలర్లలో ఆకాష్ మహరాజ్ సింగ్ 3 వికెట్లు తీయగా, మహ్మద్ షమీ, షాబాజ్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు. లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నప్పటికీ.. ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య జరిగిన 7 ముఖాముఖి పోరుల్లో చెన్నై, లక్నో చెరో మూడుసార్లు గెలిచాయి. నేడు లక్నో ఈ భారీ లక్ష్యాన్ని ఛేదిస్తుందో లేదో వేచి చూడాలి.

Story first published: Friday, May 15, 2026, 21:46 [IST]
Other articles published on May 15, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+