Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: ప్లేఆఫ్స్ రేసు నుంచి ఆ జట్టు ఔట్!

IPL 2026: ఐపీఎల్ 202 లో భాగంగా ఆదివారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌పై ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో సీఎస్కే తన ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోగా.. ఈ ఓటమితో లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించింది. 204 పరుగుల భారీ లక్ష్యాన్ని సీఎస్కే మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి అభిమానులను ఖుషీ చేసింది.

సంజూ, రుతురాజ్ మెరుపు ఆరంభం.. ఉర్విల్ పటేల్ విధ్వంసం
భారీ లక్ష్య ఛేదనలో చెన్నైకి ఓపెనర్లు సంజూ శాంసన, రుతురాజ్ గైక్వాడ్ మెరుపు ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ కేవలం 22 బంతుల్లోనే 45 పరుగులు జోడించారు. సంజూ శాంసన్ 14 బంతుల్లో 28 పరుగులు చేసి ఔటవ్వగా.. అనంతరం క్రీజులోకి వచ్చిన ఉర్విల్ పటేల్ సిక్సర్ల సునామీ సృష్టించాడు. కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన ఉర్విల్ పటేల్.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన ఫిఫ్టీ నమోదు చేసిన యశస్వి జైస్వాల్ రికార్డును సమం చేశాడు. ఉర్విల్ మొత్తం 23 బంతుల్లో 8 సిక్సర్లు, 2 ఫోర్లతో 65 పరుగులు చేసి సీఎస్కే విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ రుతురాజ్ 42 పరుగులతో రాణించాడు.

CSK vs LSG IPL 2026 Urvil Patel Smashes Fastest Fifty as Chennai Knocks Lucknow Out of Playoffs

జోష్ ఇంగ్లిస్ పోరాటం వృథా
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఓపెనర్ జోష్ ఇంగ్లిస్ ఆరంభం నుంచే చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 17 బంతుల్లోనే ఫిఫ్టీ మార్కును అందుకున్న ఇంగ్లిస్.. మొత్తం 33 బంతుల్లో 85 పరుగులు (10 ఫోర్లు, 6 సిక్సర్లు) చేశాడు. మిడిల్ ఆర్డర్‌లో రిషబ్ పంత్ (15), ఐడెన్ మార్‌క్రమ్ (6) విఫలమైనప్పటికీ, చివర్లో షాబాజ్ అహ్మద్ (43 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో లక్నో స్కోరు 200 దాటింది.

మలుపు తిప్పిన జేమీ ఓవర్టన్
లక్నో ఇన్నింగ్స్‌ను జేమీ ఓవర్టన్ తన బౌలింగ్‌తో నియంత్రించాడు. ఒకే ఓవర్‌లో ప్రమాదకరమైన జోష్ ఇంగ్లిస్, కెప్టెన్ రిషబ్ పంత్‌లను ఔట్ చేసి లక్నోకు షాక్ ఇచ్చాడు. ఓవర్టన్ మొత్తం మూడు వికెట్లు పడగొట్టగా.. అన్షుల్ కాంబోజ్ రెండు వికెట్లు తీశాడు. భారీ లక్ష్యం ఉన్నప్పటికీ సీఎస్కే బ్యాటర్లు క్రమం తప్పకుండా బౌండరీల వర్షం కురిపించడంతో లక్నో బౌలర్లు ఒత్తిడికి గురయ్యారు. చివర్లో డెవాల్డ్ బ్రెవిస్ (10), కార్తీక్ శర్మ (20) ఔట్ అయినా.. ప్రశాంత్ వీర్(18), శివమ్ దూబే(15) సిక్సర్లు బాదడంతో చెన్నై లక్ష్యాన్ని సులభంగా అందుకుంది.

లక్నో ప్లేఆఫ్ ఆశలు గల్లంతు
ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ 11 మ్యాచ్‌లలో 6 విజయాలతో 12 పాయింట్లకు చేరుకుంది. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ 11 మ్యాచ్‌లలో కేవలం 3 విజయాలతో 6 పాయింట్లతో పట్టికలో అట్టడుగున నిలిచింది. ఈ ఓటమితో లక్నో జట్టు ప్లేఆఫ్ రేసు నుంచి అధికారికంగా తప్పుకున్నట్లయ్యింది. చెన్నై గడ్డపై జరిగిన ఈ హై-స్కోరింగ్ మ్యాచ్ ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదాన్ని అందించింది.

Story first published: Sunday, May 10, 2026, 19:59 [IST]
Other articles published on May 10, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+