CSK vs LSG: జోష్ ఇంగ్లిస్ విధ్వంసం.. సీఎస్కే గట్టెక్కేనా!
CSK vs LSG: ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ఉత్కంఠ పోరు జరుగుతోంది. ఈ కీలక పోరులో టాస్ గెలిచిన సీఎస్కే ముందుగా బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 203 పరుగుల భారీ స్కోరు చేసింది.
జోష్ ఇంగ్లిస్ సునామీ.. 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
మొదట బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్ జోష్ ఇంగ్లిస్ చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఇంగ్లిస్.. స్టేడియం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించాడు. ఇంగ్లిస్, మిచెల్ మార్ష్ కలిసి మొదటి వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇంగ్లిస్ మొత్తం 33 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 85 పరుగులు చేసి జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు.

మిడిల్ ఆర్డర్ వైఫల్యం.. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన చెన్నై
లక్నో జట్టుకు అదిరిపోయే ఆరంభం లభించినప్పటికీ.. మిడిల్ ఆర్డర్ మాత్రం తడబడింది. మిచెల్ మార్ష్ (10)ను అన్షుల్ కాంబోజ్ ఔట్ చేయగా, నికోలస్ పూరన్ (1)ను నూర్ అహ్మద్ పెవిలియన్‌కు చేర్చాడు. ఇక జేమీ ఓవర్టన్ ఒకే ఓవర్‌లో ప్రమాదకరమైన జోష్ ఇంగ్లిస్ (85), కెప్టెన్ రిషబ్ పంత్ (15)లను ఔట్ చేసి లక్నోను దెబ్బతీశాడు. ఆ తర్వాత ఐడెన్ మార్‌క్రమ్ (6) రనౌట్ అవ్వగా, అక్షత్ రఘువంశీ (18)ని కూడా ఓవర్టన్ ఔట్ చేశాడు. నిర్ణీత ఓవర్లలో లక్నో జట్టు భారీ స్కోరు సాధించినప్పటికీ, చివరిలో వరుసగా వికెట్లు కోల్పోయింది.
షాబాజ్ అహ్మద్ ఫినిషింగ్ టచ్.. చెన్నై ముందు భారీ సవాలు
వికెట్లు పడుతున్నా షాబాజ్ అహ్మద్ ఎంతో సంయమనంతో ఆడి జట్టును ఆదుకున్నాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన షాబాజ్(43*).. చివరి రెండు ఓవర్లలో ధాటిగా ఆడి జట్టు స్కోరును 200 దాటించాడు. దీంతో లక్నో గౌరవప్రదమైన స్కోరును సాధించింది. సీఎస్కే బౌలర్లలో జేమీ ఓవర్టన్ 3 వికెట్లు పడగొట్టగా.. అన్షుల్ కాంబోజ్ 2, నూర్ అహ్మద్ ఒక వికెట్ తీశాడు. అయితే 2019 తర్వాత ఐపీఎల్‌లో చెన్నై జట్టు 180 కంటే ఎక్కువ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన దాఖలాలు లేవు. మరి ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించి సీఎస్కే విజయం సాధిస్తుందా? లేక లక్నో ఈ స్కోరును కాపాడుకుని ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంటుందో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications