Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK vs LSG: కీలక మార్పులతో బ‌రిలోకి చెన్నై, ల‌క్నో.. ఇరు జ‌ట్ల ప్లేయింగ్ 11 ఇదే!

CSK vs LSG: CSK Playing 11- Moeen ali in, Devon Canway out .. LSG Playing 11- Mohsin khan out, Nadeem or Goutham in

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2022లో నేడు మ‌రో ఆస‌క్తిర పోరు జ‌ర‌గ‌బోతుంది. నేటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ చెన్నైసూప‌ర్ కింగ్స్‌, కొత్త జ‌ట్టు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి. బ్ర‌బోర్న్ స్టేడియం వేదిక‌గా రాత్రి 7:30 గంట‌ల‌కు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇక ఇరు జ‌ట్లు త‌మ ఆరంభ మ్యాచ్‌లో ఓడిపోయాయి. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి లీగ్‌లో త‌మ విజ‌యాల ఖాతా తెర‌వాల‌ని రెండు జ‌ట్లు కూడా ప‌ట్టుద‌లగా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో రెండు జ‌ట్ల ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండ‌బోతుందో ఓ సారి చూద్దాం.

జ‌ట్టులోకి మొయిన్ అలీ

జ‌ట్టులోకి మొయిన్ అలీ

వీసా స‌మస్యల‌తో తొలి మ్యాచ్‌కు దూర‌మైన చెన్నైసూప‌ర్ కింగ్స్ ఆల్‌రౌండ‌ర్ మొయిన్ అలీ ఈ మ్యాచ్‌లో బ‌రిలోకి దిగ‌నున్నాడు. దీంతో తొలి మ్యాచ్‌లో ఆడిన న్యూజిలాండ్ ఆట‌గాడు డేవాన్‌ కాన్వేను ఈ మ్యాచ్‌కు దూరం పెట్టే అవ‌కాశాలు ఉన్నాయి. రుతురాజ్ గైక్వాడ్‌, రాబిన్ ఊత‌ప్ప సీఎస్కే ఇన్నింగ్స్‌ను ప్రారంభించ‌నుండ‌గా.. మూడో స్థానంలో మొయిన్ అలీ, నాల్గో స్థానంలో అంబ‌టి రాయుడు, ఐదో స్థానంలో కెప్టెన్ రవీంద్ర జ‌డేజా, ఆరో స్థానంలో శివ‌మ్ దూబే, ఏడో స్థానంలో మ‌హేంద్ర‌సింగ్ ధోని బ్యాటింగ్‌కు రానున్నారు.

బౌల‌ర్లు వీళ్లే

బౌల‌ర్లు వీళ్లే

ఇక బౌల‌ర్లుగా గ‌త మ్యాచ్‌లో ఆడిన మిచెల్ శాంట్న‌ర్, డ్వేన్ బ్రావో, ఆడ‌మ్ మిల్నే, తుషార్ దేశ్‌పాండేనే ఆడే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ జ‌ట్లులో ఆల్‌రౌండ‌ర్లుగా కెప్టెన్ ర‌వీంద్ర జ‌డేజా, మొయిన్ అలీ, బ్రావో వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. మొత్తానికి ఆరంభ మ్యాచ్‌లో ఆడిన జ‌ట్టులో ఒకే ఒక మార్పుతో చెన్నైసూప‌ర్ కింగ్స్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే అవ‌కాశాలు ఉన్నాయి. మొత్తానికి ఈ మ్యాచ్‌లో గెలవాల‌ని సీఎస్కే ప‌ట్టుద‌ల‌గా ఉంది.

బ్యాట‌ర్లు వాళ్లే

బ్యాట‌ర్లు వాళ్లే

ఇక లక్నో సూప‌ర్ జెయింట్స్ విష‌యానికొస్తే ఆ జ‌ట్టు గ‌త మ్యాచ్‌లో బ‌రిలోకి దిగిన బ్యాట‌ర్ల‌తోనే ఈ మ్యాచ్‌లోనూ ఆడే అవ‌శాలు ఉన్నాయి. బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో ఎలాంటి మార్పులు చేసే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. ఓపెన‌ర్లుగా కేఎల్ రాహుల్, క్వింట‌న్ డికాక్ ఖాయం కాగా మిడిలార్డ‌ర్‌లో ఇవిన్ లూయిస్, మ‌నీష్‌ పాండే, దీప‌క్ హుడా, అయూష్ బ‌దోని, కృనాల్ పాండ్యా ఆడ‌నున్నారు.

బౌలింగ్‌లో ఒక మార్పు

బౌలింగ్‌లో ఒక మార్పు

ఈ మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ త‌మ బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఒక మార్పు చేసే అవ‌కాశాలు ఉన్నాయి. గ‌త మ్యాచ్‌లో అంత‌గా ఆక‌ట్టుకోని మొహ్సిన్ ఖాన్ స్థానంలో స్పిన్న‌ర్మ గౌత‌మ్ లేదా న‌దీమ్‌ల‌లో ఒక‌రిని ఆడించే అవ‌కాశాలు ఉన్నాయి. ఇక మిగ‌తా వారిలో చ‌మీర‌, ఆవేష్ ఖాన్‌, ర‌వి బిష్ణోయ్ కొన‌సాగనున్నారు. జ‌ట్టులో ఆల్‌రౌండ‌ర్ల‌ పాత్రను దీప‌క్ హుడా, కృనాల్ పాండ్యా పోషించ‌నున్నారు.

తుది జ‌ట్లు అంచ‌నా

తుది జ‌ట్లు అంచ‌నా

చెన్నైసూప‌ర్ కింగ్స్‌: రుతురాజ్ గైక్వాడ్‌, రాబిన్ ఊత‌ప్ప, మొయిన్ అలీ, అంబ‌టి రాయుడు, రవీంద్ర జ‌డేజా(కెప్టెన్‌) , శివ‌మ్ దూబే, మ‌హేంద్ర‌సింగ్ ధోని (వికెట్ కీప‌ర్‌), డ్వేన్ బ్రావో, మిచెల్ శాంట్న‌ర్, ఆడ‌మ్ మిల్నే, తుషార్ దేశ్‌పాండే.

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌: కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), క్వింట‌న్ డికాక్ (వికెట్ కీప‌ర్), ఇవిన్ లూయిస్, మ‌నీష్‌ పాండే, దీప‌క్ హుడా, అయూష్ బ‌దోని, కృనాల్ పాండ్యా, చ‌మీర‌, ఆవేష్ ఖాన్‌, గౌత‌మ్ లేదా న‌దీమ్‌, ర‌వి బిష్ణోయ్.

Story first published: Thursday, March 31, 2022, 9:31 [IST]
Other articles published on Mar 31, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+