ఒకే ఓవర్‌లో 2, 6, 6, 6, 4, 6 ప్యాట్ కమిన్స్ మెరుపులు.. ధోనీకి చెమటలు!

IPL 2021 : MS Dhoni Get Tensed When Cummins Hits 30 Runs In A Single Over || Oneindia Telugu

ముంబై: కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆల్‌రౌండర్ ప్యాట్ కమిన్స్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఆసీస్ స్టార్ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. 221 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టాపార్డర్ బ్యాట్స్‌మెన్‌ అంతా విఫలమైన వేళ.. చివర్లో భారీ షాట్లు ఆడిన ప్యాట్ కమిన్స్ (34 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 66 నాటౌట్‌‌) మెరుపు హాఫ్ సెంచరీ బాదేశాడు. కానీ మరో ఎండ్‌లో అతనికి సహచరుల నుంచి మద్దతు లభించకపోవడంతో కోల్‌కతా 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అయితే సామ్ కరన్ వేసిన ఓవర్‌లో కమిన్స్ ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు. ఇది ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

సామ్ కరన్‌కు చుక్కలు..

సామ్ కరన్‌కు చుక్కలు..

కోల్‌కతా విజయానికి చివరి 30 బంతుల్లో 75 పరుగులు అవసరమవగా.. క్రీజులో పాట్ కమిన్స్, కమలేశ్ నాగర్‌కోటి ఉన్నాడు. అప్పటికే 7 వికెట్లు చేజార్చుకున్న కోల్‌కతా.. 146 పరుగులతో ఉంది. దాంతో చెన్నై జట్టు కూడా గెలుపుపై పూర్తి ధీమాతో కనిపించింది. కానీ ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేసిన సామ్ కరన్ బౌలింగ్‌లో ఒక్కసారిగా టాప్‌గేర్‌లోకి వెళ్లిపోయిన ప్యాట్ కమిన్స్ .. 2, 6, 6, 6, 4, 6 బాది 30 పరుగులు పిండుకున్నాడు. దాంతో గెలుపు సమీకరణం కాస్త 24 బంతుల్లో 45 పరుగులుగా మారిపోయింది.

ధోనికి చెమటలు..

ధోనికి చెమటలు..

ప్యాట్ కమిన్స్ ఇన్నింగ్స్ ధాటికి ధోనీకి కూడా చెమటలు పట్టేశాయి. ఆ ఓవర్‌లో శామ్ కరన్‌తో ధోనీ పదే పదే చర్చలు జరుపుతూ.. సూచనలు చేసినా లాభం లేకపోయింది. సామ్ కరన్ బంతుల్ని మార్చినా.. ప్యాట్ కమిన్స్ మాత్రం హిట్టింగ్‌ ఆపలేదు. ఈ క్రమంలో లాంగాఫ్ దిశగా ఫస్ట్ సిక్స్ కొట్టిన కమిన్స్ ఆ తర్వాత మిడ్ వికెట్, స్వ్కేర్ లెగ్‌లోనూ బంతుల్ని స్టాండ్స్‌లోకి కొట్టేశాడు. కానీ చివరి ఓవర్‌లో కోల్‌కతా విజయానికి 20 పరుగులు అవసరమవగా.. తొలి బంతికే ప్రసీద్ ఆఖరి వికెట్ రూపంలో రనౌట్‌గా వెనుదిరిగాడు. దాంతో.. చెన్నై ఊపిరి పీల్చుకుంది. పాట్ కమిన్స్ అజేయంగా క్రీజులో నిలిచాడు.

హీరో కాస్త విలన్‌గా..

హీరో కాస్త విలన్‌గా..

అంతకుముందు జోరు మీదున్న ఆండ్రీ రస్సెల్ (22 బంతుల్లో 54; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు)‌ను సామ్ కరన్ సూపర్బ్ బాల్‌కు పెవిలియన్ చేర్చి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అతను వేసిన 12వ ఓవర్‌ రెండో బంతికే ఆండ్రీ రస్సెల్‌ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. లెగ్ స్టంప్‌ను లక్ష్యంగా చేసుకుని సామ్ కరన్ బంతిని సంధించగా.. వైడ్‌గా వెళ్తుందనుకున్న రస్సెల్ కొద్దిగా ముందుకు జరిగాడు. కానీ.. అతని శరీరానికి అత్యంత సమీపం నుంచి వెనక్కి వెళ్లిన బంతి లెగ్ స్టంప్‌ని గీరాటేసింది. అప్పటి వరకూ బంతిని చక్కగా టైమింగ్ చేస్తూ సిక్సర్లు బాదిన రసెల్ ఆ తరహాలో సింపుల్ బాల్‌కి ఔటవతాడని ఎవరూ ఊహించలేదు. ఈ వికెట్‌తో చైన్నైకి హీరోలా కనిపించిన సామ్ కరన్.. కమిన్స్ ధాటికి ఒక్కసారిగా విలన్‌గా మారిపోయాడు.

చాహర్ దెబ్బకు..

చాహర్ దెబ్బకు..

తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 220 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఓపెనర్‌ డు ప్లెసిస్‌ (60 బంతుల్లో 95 నాటౌట్‌; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీకి ఐదు పరుగుల దూరంలో నిలువగా... రుతురాజ్‌ గైక్వాడ్‌ (42 బంతుల్లో 64; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆకట్టుకున్నాడు. అనంతరం ఛేదన మొదలు పెట్టిన కోల్‌కతాను ఆరంభంలో దీపక్‌ చహర్‌ (4/29) తన పేస్‌తో దెబ్బకొట్టినా... అనంతరం పుంజుకుని 19.1 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటై 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇన్‌గిడి (3/28) కూడా ఆకట్టుకున్నాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, April 22, 2021, 10:43 [IST]
Other articles published on Apr 22, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X