Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK vs KKR: ధోని కెప్టెన్సీలో మారని సీఎస్కే అదృష్టం.. ఈజీగా గెలిచిన కేకేఆర్!

CSK vs KKR: ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నైసూపర్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు అలవోకగా విజయం సాధించింది. చెపాక్ స్టేడియంలో సీఎస్కేను 8 వికెట్ల తేడాతో కేకేఆర్ చిత్తుచిత్తుగా ఓడించింది. టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకోగా.. సీఎస్కే బ్యాటింగ్ చేసింది. సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 103 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం 104 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా జట్టు 10.1 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా విజయాన్ని సాధించింది.కేకేఆర్ ఈ మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది.

చెలరేగిన క్వింటన్ డికాక్, సునీల్ నరైన్
లక్ష్య ఛేదనకు దిగిన కేకేఆర్ ఓపెనర్లు క్వింటన్ డికాక్, సునీల్ నరైన్ ముందు నుంచే దూకుడుగా ఆడారు. క్వింటన్ డికాక్ 16 బంతుల్లోనే 23 పరుగులు చేయగా.. సునీల్ నరైన్ 18 బంతుల్లోనే 44 పరుగులు చేసి ఔటయ్యారు. అనంతరం రహానే(20), రింకూ సింగ్(15)లు ఇద్దరూ కలిసి కోల్‌కతా జట్టును విజయ తీరాలకు నడిపించారు. సీఎస్కే బౌలర్లలో అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్ తలో వికెట్ తీయగలిగారు.

CSK vs KKR Dhoni s Luck Fails to Change - KKR Wins Easily by 8 Wickets

సీఎస్కే బ్యాటింగ్ పూర్తిగా విఫలం
కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో సీఎస్కే బ్యాటింగ్ ఘోరంగా విఫలమైంది. కేకేఆర్ బౌలర్లు సీఎస్కే ఓపెనర్లు ఇద్దరినీ 16 పరుగుల స్కోరు వద్ద పెవిలియన్ కు పంపారు. అనంతరం విజయ్ శంకర్, రాహుల్ త్రిపాఠి మిడిలార్డర్ లో ఇన్నింగ్స్ నిర్వహించడానికి ప్రయత్నించారు. కానీ వారు కూడా కేకేఆర్ బౌలర్ల ముందు నిలబడలేకపోయారు. విజయ్ శంకర్ 21 బంతుల్లో 29 పరుగులు చేశాడు.రాహుల్ త్రిపాఠి 22 బంతుల్లో 16 పరుగులు చేశాడు.ఒకవైపు శివం దూబే సీఎస్కే తరపున పోరాటం చేశాడు. కానీ అతను కూడా జట్టు తరపున వేగవంతమైన ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. సీఎస్కే తరపున శివం దూబే చివరి వరకు నాటౌట్ గా నిలిచాడు. 29 బంతుల్లో 31 పరుగులు చేశాడు. ధోనితో సహా జట్టులోని 6 మంది బ్యాటర్లు 6 పరుగులు మాత్రమే జోడించారు. ఈ కారణంగానే సీఎస్కే జట్టు సొంతమైదానంలో విఫలమైంది.

కేకేఆర్ బౌలింగ్.. అద్బుతమే
సీఎస్కేపై కేకేఆర్ బౌలింగ్ గురించి చెప్పాలంటే.. చాలా అద్భుతంగా ఉంది. కేకేఆర్ తరపున సునీల్ నరైన్ అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టాడు. హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిలు కూడా తమ మ్యాజిక్ ను ప్రదర్షించి తలో రెండు వికెట్లు పడగొట్టారు. వైభవ్ అరోరా, మొయిన్ అలీలు తలో వికెట్ తీసుకున్నారు.

Story first published: Friday, April 11, 2025, 22:51 [IST]
Other articles published on Apr 11, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+