Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK vs KKR: కెప్టెన్‌గా బరిలోకి ధోని.. రుతురాజ్ స్థానంలో త్రిపాఠి.. తుది జట్లు ఇవే..

CSK vs KKR: ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ , కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా 25వ మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్ కు ముందు సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో ధోనిని కెప్టెన్ గా నియమించారు. ఈ క్రమంలో ధోని, కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహాన్ టాస్ కోసం వచ్చారు. టాస్ గెలిచిన కేకేఆర్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. సీఎస్కే జట్టు బ్యాటింగ్ తో బరిలోకి దిగనుంది.

కేకేఆర్ జట్టులోకి మొయిన్ అలీ
సీఎస్కేతో జరిగే ఈ మ్యాచ్‌లో అజింక్య రహానే తన ప్లేయింగ్ XIలో ఒక మార్పు చేశాడు. స్పెన్సర్ జాన్సన్ స్థానంలో మొయిన్ అలీని జట్టులోకి తీసుకున్నారు. కాగా సీఎస్కే రెండు కీలక మార్పులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో రాహుల్ త్రిపాఠికి అవకాశం లభించింది. ముఖేష్ చౌదరి స్థానంలో అన్షుల్ కాంబోజ్‌కి అవకాశం లభించింది.

CSK vs KKR Dhoni Returns as Captain Tripathi Replaces Gaikwad in Playing XI IPL 2025

రహానే ఏం చెప్పాడంటే?
కేకేఆర్ కెప్టెన్ మాట్లాడుతూ.." మేము ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. గత మ్యాచ్ లో చాలా విషయాలు తెలిశాయి. మేము ఒక జట్టుగా చాలా బాగా ఆడాం. ప్రతి మ్యాచ్‌ను మెరుగుపరచుకోవడం ముఖ్యం. ఇది మంచి వికెట్ లాగా కనిపిస్తోంది, దానిలో పెద్దగా మార్పు ఉండదు.మేము అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాం. కాబట్టి మేము ముందుగా బౌలింగ్ చేసి లక్ష్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తాము." అని అన్నాడు.

ధోని ఏం చెప్పాడంటే?
ధోని మాట్లాడుతూ.." మేము ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించబడింది. ఇది బౌలింగ్ పిచ్ లాగా ఉంది కాబట్టి మంచి ప్రారంభం లభించాలి లేదంటే మిడిల్ ఆర్డర్ ఒత్తిడికి లోనవుతుంది. రుతురాజ్ మోచేయికి గాయం కావడంతో టోర్నమెంట్ నుంచి తొలగించబడ్డాడు. అతను చాలా మంచి బ్యాటర్. ప్రారంభంలోనే బౌండరీలు సాధించడం, ప్రారంభంలోనే రెండు వికెట్లు పడగొట్టడానికి ప్రయత్నించడం ముఖ్యం. మా కోసం కొన్ని మార్పులు - రుతురాజ్ స్థానంలో త్రిపాఠి, ముఖేష్ స్థానంలో అన్షుల్ కాంభోజ్ జట్టులోకి వచ్చారు. " అని ధోని చెప్పుకొచ్చాడు.

సీఎస్కే ప్లేయింగ్ 11:
రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, శివమ్ దూబే, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్/కెప్టెన్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్.

కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ 11
క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, మొయిన్ అలీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి.

.

Story first published: Friday, April 11, 2025, 19:32 [IST]
Other articles published on Apr 11, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+