Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK vs KKR: చెన్నై చెత్త బ్యాటింగ్.. 100 పరుగులు దాటడానికి ఇన్ని తిప్పలా..!

CSK vs KKR: కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. టాస్ గెలిచిన కేకేఆర్ మొదట బౌలింగ్ ఎంచుకుని సీఎస్కేను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 103 పరుగులు మాత్రమే చేయగలిగింది. కేకేఆర్ ముంగిట 104 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఈ ఐపీఎల్ సీజన్ లో ఇదే అతి తక్కువ స్కోరు కావడం గమనార్హం.

ఎంఎస్ ధోని కెప్టెన్సీలో సీఎస్కే దారుణంగా విఫలమైంది. చెన్నై జట్టులో ఏ ఒక్క బ్యాటర్ కూడా రాణించలేకపోయాడు. సీఎస్కే మొత్తం ఇన్నింగ్స్ కేవలం ఒక సిక్సర్, 8 ఫోర్లు మాత్రమే ఉండటం అభిమానులను నిరాశపరుస్తోంది. సీఎస్కే తరపున శివమ్ దూబే 31, విజయ్ శంకర్ 29 పరుగులతో హైయ్యస్ట్ స్కోరర్లుగా నిలిచారు. శివమ్ దూబే చివరివరకు ఆడినా అంతగా ప్రభావం చూపలేకపోయాడు. ధోని(1) వచ్చిన వెంటనే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడంతో సీఎస్కే ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.

CSK vs KKR Chennai s Poor Batting Performance Struggling to Reach 100 Runs

అద్భుతంగా బౌలింగ్ చేసిన కేకేఆర్ బౌలర్లు

కేకేఆర్ బౌలర్లు ఈ మ్యాచ్ లో అద్భుతంగా బౌలింగ్ చేశారు. సీఎస్కే బ్యాటర్లను తమ బౌలింగ్ తో ముప్పుతిప్పలు పెట్టారు. వెంటవెంటనే వికెట్లు పడిపోతుండడంతో సీఎస్కే అతలాకుతలం అయింది. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తిలు తమ స్పిన్ మాయాజాలంతో సీఎస్కేను అడ్డుకున్నారు. సీఎస్కే బౌలర్లలో సునీల్ నరైన్ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా తలో రెండు వికెట్లు తీశారు. మొయిన్ అలీ, వైభవ్ అరోరా తలో వికెట్ పడగొట్టారు.

Story first published: Friday, April 11, 2025, 21:44 [IST]
Other articles published on Apr 11, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+