Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2021 Final: ఇరు జట్లకు తలపునొప్పిగా మారిన సీనియర్ ప్లేయర్స్ ఎంపిక.. ఫైనల్‌కు ఆ ఇద్దరు డౌటే!!

CSK vs KKR: Andre Russell and Suresh Raina unlikely to play IPL 2021 Final

దుబాయ్‌: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2021లో బిగ్‌ ఫైట్‌కు రంగం సిద్ధమైంది. దుబాయ్‌ వేదికగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఫైనల్‌ మ్యాచ్ జరుగనుంది. గత సీజన్‌లో కనీసం ప్లే ఆఫ్స్‌ చేరకుండానే వెనుదిరిగిన చెన్నై రెట్టించిన ఉత్సాహంతో దూసుకొస్తే.. కోల్‌కతా పడిలేచిన కెరటంలా వరుస విజయాలు సొంతం చేసుకుంది. లీగ్‌ దశలో గెలిస్తే తప్ప నిలువని పరిస్థితుల్లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది మోర్గాన్ సేన.

ఎలిమినేటర్‌లో బెంగళూరును చిత్తుచేసిన కేకేఆర్‌.. క్వాలిఫయర్‌-2లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఉత్కంఠ విజయాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు లీగ్‌ ఆఖర్లో హ్యాట్రిక్‌ ఓటములతో టాప్-2లో నిలిచిన చెన్నై.. ఢిల్లీని ఓడించి తొమ్మిదో సారి ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగడం పక్కా.

షకీబ్/రస్సెల్

షకీబ్/రస్సెల్

ఐపీఎల్ 2021 ఫైనల్ ముంగిట చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల కెప్టెన్లకు పెద్ద తలనొప్పి వచ్చిపడింది. ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో సీనియర్ ఆటగాళ్లకు చోటివ్వాలా లేదా విన్నింగ్ కాంబినేషన్‌నే కొనసాగించాలా అని తర్జనభర్జన పడుతున్నారు. స్టార్ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్ విషయంలో కేకేఆర్‌ ఎటూ తేల్చుకోలేకపోతోంది. గాయం కారణంగా గత మ్యాచుల్లో ఆడని రసెల్.. ప్రస్తుతం ఫిట్‌నెస్‌ సాదించాడు.

రసెల్ స్థానంలో ఆడిన మరో ఆల్‌రౌండర్‌ షకిబ్‌ ఉల్ హాసన్ సత్తాచాటాడు. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థిని కట్టడిచేశాడు. షార్జాలో జరిగిన ఎలిమినేటర్‌, క్వాలిఫయర్‌-2లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. స్పిన్ పిచ్ కావడంతో మరింత చెలరేగాడు. అయితే ఫైనల్ జరిగే దుబాయ్ పిచ్ షార్జా మాదిరిగా స్పిన్నర్లకు అంతగా అనుకూలించదు. ఇక్కడ పేసర్లు ప్రభావం చూపే అవకాశాలే ఎక్కువ. దాంతో ఈ ఇద్దరిలో ఎవరిని ఎంచుకోవాలని ఆలోచనలో పడింది. చూడాలి మరి కెప్టెన్ ఎవరికీ ఓటేస్తాడో.

ఉతప్ప/రైనా

ఉతప్ప/రైనా

చెన్నై స్టార్ సురేశ్ రైనా గాయపడటంతో అతని స్థానంలో రాబిన్ ఉతప్ప ఆడాడు. లీగ్ చివరి మ్యాచుల్లో కాస్త తడబడినా.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో ఉతప్ప అద్భుతంగా రాణించాడు. 44 బంతుల్లోనే ఏడు ఫోర్లు, రెండు సిక్సుల సాయంతో 63 పరుగులు చేశాడు. చెన్నై విజయానికి మంచి బాటలు వేశాడు. మరోవైపు రైనా ఈ సీజన్లో అంతగా ఫామ్‌లో లేకున్నా.. ఒంటిచేత్తో మ్యాచును గెలిపించగల సత్తావున్నవాడు.

కీలక మ్యాచ్ కాబట్టి అతడి అనుభవం పనికిరానుంది. దాంతో ఫైనల్లో ఉతప్ప, రైనాలో ఎవరిని ఆడించాలనేది ఇప్పుడు చెన్నైకి పెద్ద సమస్యగా మారిపోయింది. కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఎవరిని తీసుకుంటాడో చూడాలి.

T20 World Cup:'స్టోక్స్, నేను లేకున్నా..ఇంగ్లండ్​ అంటే భయపడాల్సిందే!మ్యాచ్​కు ముందు నిద్ర కూడా పట్టకపోవచ్చు'

చెన్నైకి టెన్షన్

చెన్నైకి టెన్షన్

మరోవైపు 14 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్‌కి చేరడం ఇది తొమ్మిదోసారి కాగా.. ఇప్పటికే మూడు సార్లు టైటిల్ గెలిచింది. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ ఫైనల్‌కి చేరడం ఇది మూడో సారికాగా.. రెండు సార్లూ టైటిల్ విజేతగా నిలిచింది. ఇప్పుడు ఈ ట్రాక్ రికార్డే చెన్నైలో టెన్షన్ పెంచుతోంది. ఐపీఎల్ ఫైనల్లో ఇప్పటి వరకూ కేవలం ఒకే ఒక సందర్భంలో చెన్నై, కోల్‌కతా జట్లు ఢీకొన్నాయి. 2012లో కోల్‌కతా.. చెపాక్ వేదికగా జరిగిన ఫైనల్లో చెన్నైపై 5 వికెట్ల తేడాతో ఓడించింది. మరి ఇప్పుడు ఏ జట్టు గెలుస్తుందో చూడాలి.

తుది జట్లు (అంచనా)

తుది జట్లు (అంచనా)

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్, మోయిన్ అలీ, రాబిన్ ఉతప్ప/సురేష్ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ (కెప్టెన్, కీపర్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహర్, జోష్ హాజెల్‌వుడ్.

కోల్‌కతా నైట్ రైడర్స్:

శుభమాన్ గిల్, వెంకటేష్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, ఇయోన్ మోర్గాన్ (కెప్టెన్), దినేష్ కార్తీక్ (కీపర్), సునీల్ నరైన్, షకీబ్ అల్ హసన్/ఆండ్రీ రస్సెల్, లాకీ ఫెర్గూసన్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి.

Story first published: Friday, October 15, 2021, 10:54 [IST]
Other articles published on Oct 15, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+