CSK vs GT: ఐపీఎల్ 2025లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం సీఎస్కే ప్లేయింగ్-11లో ఒక మార్పు చేసింది. రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో దీపక్ హుడాను జట్టులోకి తీసుకుంది. గుజరాత్ కూడా ఒక మార్పు చేసింది. రబాడా స్థానంలో కోయెట్జేకు అవకాశం లభించింది.
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. "టెస్ట్ కెప్టెన్సీ బాధ్యత రావడం చాలా ఉత్సాహంగా ఉంది. ఇంగ్లండ్‌తో రానున్న సిరీస్ మాకు చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. గత మ్యాచ్‌లో మేము 16వ లేదా 17వ ఓవర్ల వరకూ పోటీగా ఉన్నాం. నిజానికి ఈ రోజు టాస్ గెలిచినా మేము ఫీల్డింగ్ చేయాలని అనుకున్నాం. పిచ్ బ్యాటింగ్‌కి అనుకూలంగా ఉంది, చాలా మార్పు ఉండకపోవచ్చు. ఒక్క మార్పు చేశాం - కగిసో రబాడా స్థానంలో జెరాల్డ్ కోయెట్జీ జట్టులోకి వచ్చాడు." అని తెలిపాడు.

సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని మాట్లాడుతూ.." మేము టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాం. ఈ పిచ్ బాగా గట్టిగా ఉంది. 40 ఓవర్ల పాటు అలాగే ఉండే అవకాశం ఉంది. చాలా వేడి ఉంది, కానీ ఇది మంచి బ్యాటింగ్ ట్రాక్‌లా అనిపిస్తోంది. నా శరీరం ఇంకా బాగానే సహకరిస్తోంది. ప్రతి సంవత్సరం ఒక కొత్త సవాలే. చెన్నై వాతావరణం సాయంత్రం 3:30-4 తర్వాత బాగుంటుంది, కానీ ఇక్కడి వాతావరణం భిన్నంగా ఉంది. మేము ఇప్పటికీ పాయింట్ల పట్టికలో చివర్లోనే ఉన్నాం. గెలిచినా, ఓడిపోయినా మా స్థానంలో మార్పు ఉండదు. అందుకే మేము మా క్రికెట్‌ను ఆస్వాదించాలి. ఒక్క మార్పు చేశాం - అశ్విన్ స్థానంలో హూడా తిరిగి జట్టులోకి వచ్చాడు." అని ధోని పేర్కొన్నాడు.
తుది జట్లు ఇవే..
సీఎస్కే ప్లేయింగ్-11: ఆయుష్ మాత్రే, డెవాన్ కాన్వే, ఉర్విల్ పటేల్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, దీపక్ హుడా, మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్.
ఇంపాక్ట్ సబ్‌లు: మతిషా పతిరనా, విజయ్ శంకర్, కమలేష్ నాగర్‌కోటి, రామకృష్ణ ఘోష్, రవిచంద్రన్ అశ్విన్.
గుజరాత్ టైటాన్స్: శుభమన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, గెరాల్డ్ కోయెట్జే, ఆర్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్, అర్షద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ.
ఇంపాక్ట్ సబ్‌లు: సాయి సుదర్శన్, అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, వాషింగ్టన్ సుందర్, ఇషాంత్ శర్మ.