Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మేము అందువల్లే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్

CSK vs GT: ఐపీఎల్ 2025లో తమ చివరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 83 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్కే జట్టు 230 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు 147 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ సీజన్‌లో గుజరాత్ జట్టుకు ఇది వరుసగా రెండో ఓటమి. ఇప్పుడు ఐపీఎల్ 2025లో టాప్-2లో ఉండే అవకాశాలు కొంచెం తక్కువగా కనిపిస్తున్నాయి. గుజరాత్ ఓటమి తర్వాత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక ప్రకటన చేశాడు.

ఓటమి అనంతరం శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. పవర్ ప్లేలోనే మ్యాచ్ తమ నుంచి దూరమైందని చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి తాము ఎప్పటికీ మ్యాచ్‌లోకి తిరిగిరాలేమని అనిపించిందన్నాడు. 230 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడం ఎప్పుడైనా కష్టమేనని పేర్కొన్నాడు. ఇప్పటికే ఔట్ అయిన జట్లు కోల్పోవడానికి ఇంకా ఏమి లేదని.. ఈ క్రమంలోనే వారు పూర్తి బలంతో ఆడతారన్నారు. తాము ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండలేకపోయామన్నారు. మేము లొంగిపోయామని భావిస్తున్నట్లు గిల్ చెప్పుకొచ్చాడు. మధ్య ఓవర్లలో పరుగులను ఆపడం చాలా ముఖ్యమని.. అలా చేయకపోతే అది సవాలుగా ఉంటుందన్నాడు. గత రెండు మ్యాచ్‌లలో మేము మిస్ అయింది ఇదేనన్నాడు.

CSK vs GT Shubman Gill Admits Powerplay Collapse Cost Gujarat Titans the Match

మంచి విషయం ఏమిటంటే మాకు రెండు లేదా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి కాబట్టి ప్లేయర్లు మొహాలిలో ఆడటానికి ప్రేరణ పొందుతారన్నాడు. అదృష్టవశాత్తూ తాను తన స్వస్థలానికి తిరిగి వెళ్తున్నానని... అక్కడ చాలా క్రికెట్ ఆడానన్నాడు. ఇది నిజంగా ఉత్సాహంగా ఉంటుందని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.

సునాయాసంగా గెలిచిన సీఎస్కే
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ జట్టును 83 పరుగుల తేడాతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన గుజరాత్ టైటాన్స్ 18.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ విధంగా సీఎస్కే మ్యాచ్‌ను సులభంగా గెలిచింది.

Story first published: Sunday, May 25, 2025, 22:14 [IST]
Other articles published on May 25, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+