For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSK vs GT: వన్డేను తలపించిన చెన్నై ఇన్నింగ్స్.. గుజరాత్ ముందు ఈజీ టార్గెట్

CSK vs GT : Ruturaj Gaikwad did a half century helps to Chennai scores 133-5

ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. చెన్నై బ్యాటర్లలో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (53పరుగులు 49బంతుల్లో 4ఫోర్లు 1సిక్స్), ఎం జగదీషన్ (39పరుగులు 33బంతుల్లో 3ఫోర్లు 1సిక్స్) రాణించడంతో నిర్ణీత 20ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 133పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్‌కు 134పరుగుల టార్గెట్ విధించింది. కట్టుదిట్టమైన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ వల్ల చెన్నై బ్యాటర్లెవరూ ధాటిగా ఆడలేకపోయారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో షమీ 4ఓవర్లలో 19పరుగులు ఇచ్చి 2వికెట్లు తీసుకుని రాణించగా.. రషీద్ ఖాన్, సాయికిషోర్, అల్జరీ జోసెఫ్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.

ఇక చెన్నైకి బ్యాటింగ్లో ఏమాత్రం శుభారంభం దక్కలేదు. చెన్నై స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే(5పరుగులు 9బంతుల్లో) షమీ బౌలింగ్లో కీపర్ క్యాచ్ అవుట్ అయ్యాడు. 4ఓవర్లు ముగిసేసరికి చెన్నై ఒక వికెట్ కోల్పోయి 15పరుగులు మాత్రమే చేసింది. 4ఓవర్లలో ఒక్క ఫోర్ కూడా చెన్నైకి రాకపోవడం గమనార్హం. ఇక 5వ ఓవర్లో చెన్నై మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ జోరు మొదలెట్టాడు. గుజరాత్ బౌలర్ యష్ దయాళ్ వేసిన ఆ ఓవర్లో 2ఫోర్లు 1సిక్సరు కొట్టడంతో ఆ ఓవర్లో 15పరుగులొచ్చాయి. ఇక మరో ఎండ్‌లో ఉన్న మొయిన్ అలీ కూడా రషీద్ ఖాన్ వేసిన ఆరో ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టి టచ్‌లోకి వచ్చినట్లు కన్పించాడు. ఇక 9వ ఓవర్లో సాయికిషోర్ బౌలింగ్లో మొయిన్ అలీ (21పరుగులు 17బంతుల్లో) క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో చెన్నై ఇన్నింగ్స్ మళ్లీ చప్పగా మారింది. ఈ క్రమంలో 15వ ఓవర్ వరకు నిలిచిన రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత రుతురాజ్ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. రషీద్ ఖాన్ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇక తర్వాత వచ్చిన శివమ్ దూబే డకౌట్ అయిపోగా.. చివర్లో ధోనీ (7) మ్యాజిక్ చేయలేకపోయాడు. దీంతో 20ఓవర్లు పూర్తయ్యేసరికి చెన్నై 133పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక చివరి వరకు నిలబడిన జగదీషన్ కాస్తో కూస్తో పర్వాలేదనిపించాడు.

తుది జట్లు
సీఎస్‌కే: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, ఎన్ జగదీషన్, శివం దూబే, ఎంఎస్ ధోనీ(కెప్టెన్), మిచెల్ సాంట్నర్, ప్రశాంత్ సోలంకి,, సిమ్రన్‌జిత్ సింగ్, మతీశ పత్రీణ, ముఖేశ్ చౌదరి
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్, వృద్దిమాన్ సాహా(కీపర్), మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్ మహమ్మద్ షమీ, సాయి కిషోర్, యశ్ దయాల్

Story first published: Sunday, May 15, 2022, 17:43 [IST]
Other articles published on May 15, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+