Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కడవరకు ‘సాహా’సం.. గుజరాత్‌కు విజయ దరహాసం, ఇక ప్లేఆఫ్స్‌లో టాప్-2లో చోటు పక్కా

CSK vs GT : Gujarat secured a place in the top 2 with a win over Chennai due to Sahas great innings

ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. గుజరాత్ ఓపెనర్ సాహా చెలరేగి ఆడడంతో గుజరాత్ విజయాన్ని ఈజీగా అందుకుంది. సాహా (67పరుగులు 57 బంతుల్లో 8ఫోర్లు, 1సిక్స్ నాటౌట్) చివరి వరకు క్రీజులో ఉండి గుజరాత్‌కు అద్భుత విజయాన్ని అందించాడు.

ఈ మ్యాచ్‌లో గెలుపు ద్వారా 20పాయింట్లకు చేరుకున్న గుజరాత్.. ప్లేఆఫ్ రేసులో టాప్ 2పొజిషన్లో ఒక జట్టుగా మారనుంది. దీంతో గుజరాత్ ప్లేఆఫ్స్ లో ఒక మ్యాచ్ ఓడినా కూడా ఫైనల్ చేరేందుకు మరో మ్యాచ్ అవకాశముంటుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ అగ్రస్థానంలో కొనసాగుతుంది.

తొలుత గుజరాత్ కట్టుదిట్టమైన బౌలింగ్

తొలుత గుజరాత్ కట్టుదిట్టమైన బౌలింగ్

తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (53పరుగులు 49బంతుల్లో 4ఫోర్లు 1సిక్స్), ఎం జగదీషన్ (39పరుగులు 33బంతుల్లో 3ఫోర్లు 1సిక్స్) రాణించడంతో నిర్ణీత 20ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 133పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో షమీ 4ఓవర్లలో 19పరుగులు ఇచ్చి 2వికెట్లు తీసుకుని రాణించగా.. రషీద్ ఖాన్, సాయికిషోర్, అల్జరీ జోసెఫ్ తలా ఒక వికెట్ తీసుకున్నారు. కట్టుదిట్టమైన బౌలింగ్ ధాటికి చెన్నై డెత్ ఓవర్లలో (15నుంచి 20ఓవర్ల మధ్య) ఒక్క ఫోరు కూడా కొట్టలేదు.

శుభారంభం ఇచ్చిన ఓపెనర్లు

శుభారంభం ఇచ్చిన ఓపెనర్లు

ఇక 134పరుగుల టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్‌కు ఖతర్నాక్ శుభారంభం దక్కింది. ఓపెనర్లు డబ్ల్యూ.సాహా, శుభ్‌మాన్ గిల్ కలిసి 59పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. తొలి ఓవర్లోనే ముఖేష్ చౌదరీ బౌలింగ్లో సాహా 3ఫోర్లు కొట్టి టచ్ లోకి వచ్చాడు. ఇక అడపదడపా బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులుపెట్టించాడు. ఈ క్రమంలో ఈ మ్యాచ్ లో అరంగేట్రం చేసిన శ్రీలంకన్ జూనియర్ లసిత్ మలింగ్ మతీష పతిరన శుభ్ మాన్ గిల్(18) ఎల్బీడబ్ల్యూ ఔట్ చేసి బ్రేక్ ఇచ్చాడు.

చివరి వరకు క్రీజులో నిలబడి మరీ గెలిపించాడు

చివరి వరకు క్రీజులో నిలబడి మరీ గెలిపించాడు

ఇక ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మాథ్యూ వేడ్ వచ్చీ రాగానే ఫోర్లతో విరుచుకుపడ్డాడు. కానీ ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయాడు. మోయిన్ అలీ బౌలింగ్లో వేడ్ (20పరుగులు 15బంతుల్లో) క్యాచ్ ఔటయ్యాడు. తర్వాత గుజరాత్ ఇన్నింగ్స్ బాగా స్లో అయింది. మరోసారి మతీషా పతిరన.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా(7)ను ఔట్ చేసి చెన్నై జట్టులో ఆశలు రేకెత్తించాడు. కానీ మిల్లర్(15పరుగులు 20బంతుల్లో నాటౌట్)తో కలిసి సాహా ఆచితూచి ఆడుతూ జట్టును విజయతీరాలకు చేర్చాడు. చివరి బంతికి బౌండరీ బాది విజయంతో ముగించాడు. ఇక ఈ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నాడు.

తుది జట్లు

తుది జట్లు

సీఎస్‌కే: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, ఎన్ జగదీషన్, శివం దూబే, ఎంఎస్ ధోనీ(కెప్టెన్), మిచెల్ సాంట్నర్, ప్రశాంత్ సోలంకి,, సిమ్రన్‌జిత్ సింగ్, మతీశ పత్రీణ, ముఖేశ్ చౌదరి

గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్, వృద్దిమాన్ సాహా(కీపర్), మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్ మహమ్మద్ షమీ, సాయి కిషోర్, యశ్ దయాల్

Story first published: Sunday, May 15, 2022, 19:48 [IST]
Other articles published on May 15, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+