CSK vs GT: భారీ అప్రదిష్ట మూటగట్టుకున్న చెన్నై సూపర్ కింగ్స్.. కొంచెమన్న షేమ్ అనిపించాలి..!

ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేయగా.. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (53పరుగులు 49బంతుల్లో 4ఫోర్లు 1సిక్స్), ఎం జగదీషన్ (39పరుగులు 33బంతుల్లో 3ఫోర్లు 1సిక్స్) రాణించడంతో నిర్ణీత 20ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 133పరుగులు మాత్రమే చేసింది. గుజరాత్ టైటాన్స్‌కు 134పరుగుల టార్గెట్ విధించింది. కట్టుదిట్టమైన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్‌కు చెన్నై బ్యాటర్లు తేలిపోయారు. ముఖ్యంగా షమీ బౌలింగ్లో ఆడడానికి బ్యాటర్లు వణికిపోయారు. ఇక ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ భారీ అప్రదిష్ఠ మూట గట్టుకుంది. డెత్ ఓవర్లలో 15నుంచి 20ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయింది. చేతిలో వికెట్లు ఉన్నా కూడా ఒక్క ఫోర్ కానీ, సిక్స్ కానీ చెన్నై బ్యాటర్ల నుంచి రాకపోవడం గమనార్హం. డెత్ ఓవర్లలో గుజరాత్ బౌలర్లు రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, మహ్మద్ షమీ అద్భుతమైన బౌలింగ్‌తో చెన్నై బ్యాటర్లను పూర్తిగా కంట్రోల్ చేశారు.

డెత్ ఓవర్లలో ఇంత చెత్త బ్యాటింగా?
15ఓవర్లు ముగిసేసరికి 109పరుగులకు రెండు వికెట్లు కోల్పోయిన చెన్నై కనీసం 150 లేదా 160పరుగుల స్కోరు చేస్తుందని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ సీన్ వేరేలా మారింది. చివరి అయిదు ఓవర్లలో ఆ జట్టు చేసింది కేవలం 24పరుగులు మాత్రమే.. అంటే డెత్ ఓవర్లలో 30బంతుల్లో కేవలం 24పరుగులు మాత్రమే చెన్నై బ్యాటర్లు చేయగలిగారు. ఐపీఎల్ లాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీలో ఇంత చెత్త ప్రదర్శన ఇదే కావొచ్చు. చేతిలో ఇంకా 8వికెట్లు ఉన్న తరుణంలో ధోనీతో సహా చెన్నై బ్యాటర్లెవరు బ్యాట్ ఝళిపించలేకపోయారు. ఫలితంగా 133పరుగులకే చెన్నై పరిమితమైంది.

డెత్ ఓవర్లలో చెన్నై బ్యాటింగ్ సాగిందిలా
16ఓవర్లో గుజరాత్ టైటాన్స్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ బౌలింగ్ చేయగా.. ఆ ఓవర్లో కేవలం 4పరుగులు మాత్రమే వచ్చాయి. అలాగే చివరి బంతికి రుతురాజ్ గైక్వాడ్ ఔటయ్యాడు. దీంతో కాస్తో కూస్తో హిట్టింగ్ చేయగల రుతురాజ్ ఔటవ్వడం చెన్నైని దెబ్బతీసింది. తర్వాత 17వ ఓవర్లో అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌కు దిగగా.. 3వ బంతికి శివమ్ దూబే డకౌట్ అయ్యాడు. ఇక ఈ ఓవర్లో ధోనీ బరిలోకి దిగినా కేవలం 3పరుగులు మాత్రమే వచ్చాయి. ఇక 18వ ఓవర్లో రషీద్ ఖాన్ బౌలింగ్ చేయగా ఆ ఓవర్లో ధోనీ, ఎం జగదీషన్ టెస్టును మరిపించేలా ఆడారు. దీంతో మళ్లీ 3పరుగులే వచ్చాయి. ఇక మిగిలిన రెండు ఓవర్లలోనైనా హిట్టింగ్ చేస్తారేమోనని ఎదురుచూస్తే.. 19వ ఓవర్ యష్ దయాళ్ వేయగా ఆ ఓవర్లోనూ చెన్నై తన టెస్ట్ ఇన్నింగ్స్ కొనసాగించి ఆ ఓవర్లో 8పరుగులే వచ్చాయి. అందులో మూడు వైడ్లే. ఇక ఆఖరి 20ఓవర్ మహ్మద్ షమీ బౌలింగ్ వేయగా ఆ ఓవర్ 3వ బంతికి ధోనీ క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆఖరి ఓవర్లోనూ 6పరుగులే వచ్చాయి. దీంతో చెన్నై కేవలం 133పరుగులే చేయగలిగింది.

షమీ భీభత్సం తొలి 4ఓవర్లలోనూ బౌండరీ రాలే
ఇక ఈ మ్యాచ్‌లో పవర్ ప్లేలోనూ చెన్నై తన టెస్ట్ ఇన్నింగ్స్ కొనసాగించింది. ఇక చెన్నైకి బ్యాటింగ్లో ఏమాత్రం శుభారంభం దక్కలేదు. చెన్నై స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే(5పరుగులు 9బంతుల్లో) షమీ బౌలింగ్లో కీపర్ క్యాచ్ అవుట్ అయ్యాడు. 4ఓవర్లు ముగిసేసరికి చెన్నై ఒక వికెట్ కోల్పోయి 15పరుగులు మాత్రమే చేసింది. 4ఓవర్లలో ఒక్క ఫోర్ గానీ సిక్సర్ గానీ చెన్నైకి రాకపోవడం గమనార్హం. కెప్టెన్ హార్దిక్ పాండ్యా, షమీ తొలి నాలుగు ఓవర్లు చాలా కట్టుదిట్టంగా వేశారు. ఇక ఈ మ్యాచ్‌లో షమీ నాలుగు ఓవర్లలో కేవలం 19పరుగులే ఇచ్చి డెవాన్ కాన్వే, ధోనీ లాంటి కీలక ప్లేయర్ల వికెట్లు తీశాడు. అలాగే షమీ ఈ సీజన్లో 13ఇన్నింగ్స్ లో 18వికెట్లు తీశాడు. అతని ఎకానమీ కూడా 7.63గా ఉండడం గమనార్హం. గుజరాత్ విజయాల్లో షమీ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్, సాయికిషోర్, అల్జరీ జోసెఫ్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.

తుది జట్లు
సీఎస్‌కే: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, ఎన్ జగదీషన్, శివం దూబే, ఎంఎస్ ధోనీ(కెప్టెన్), మిచెల్ సాంట్నర్, ప్రశాంత్ సోలంకి,, సిమ్రన్‌జిత్ సింగ్, మతీశ పత్రీణ, ముఖేశ్ చౌదరి
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్, వృద్దిమాన్ సాహా(కీపర్), మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్ మహమ్మద్ షమీ, సాయి కిషోర్, యశ్ దయాల్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications