CSK vs DC: ఏడాది గ్యాప్ వచ్చినా.. ఎంఎస్ ధోనీ ఏం మారలేదు.. వీడియో చూస్తే మతిపోవాల్సిందే!!

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ 2020లో టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. ఇప్పటివరకు ఈ సీజన్‌లో మూడు మ్యాచ్‌లు ఆడితే.. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌ మినహా రాజస్తాన్ రాయల్స్‌, డిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో పూర్తిగా విఫలమైంది. బౌలింగ్‌లో కాస్త పర్వాలేదనిపిస్తున్నా.. బ్యాటింగ్‌లో మాత్రం చెన్నై పూర్తిగా విఫలమవుతుంది. అయితే కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాత్రం తన వికెట్‌ కీపింగ్‌లో మెరుపు విన్యాసాలు చేస్తున్నాడు.

మెరుపు వేగంతో స్టంపౌట్

మెరుపు వేగంతో స్టంపౌట్

దుబాయ్ వేదికగా శుక్రవారం రాత్రి డిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ వికెట్‌ కీపింగ్‌లో రెండు అద్భుతాలు చేశాడు. ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా (64: 43 బంతుల్లో 9x4, 1x6)‌ని మెరుపు వేగంతో స్టంపౌట్ చేసిన ధోనీ.. ఆ తర్వాత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (26: 22 బంతుల్లో 1x4) ఇచ్చిన క్యాచ్‌ని కళ్లుచెదిరే రీతిలో డైవ్ చేసి అందుకున్నాడు. ముఖ్యంగా అయ్యర్ క్యాచ్‌ను పట్టిన తీరు అందరినీ ఆశ్చర్యపరుతోంది. 39 ఏళ్ల ధోనీ.. యువ క్రికెటర్ తరహాలో డైవ్ చేసి మరి బంతిని అందుకున్నాడు.

యువ క్రికెటర్ తరహాలో

యువ క్రికెటర్ తరహాలో

ఇన్నింగ్స్ 19వ ఓవర్‌ను‌ శామ్ కరన్ బౌలింగ్‌ చేశాడు. చివరి బంతిని శ్రేయాస్ అయ్యర్ భారీ షాట్ ఆడగా.. ఫస్ట్ స్లిప్‌లో గాల్లోకి లేచిన బంతి బౌండరీ దిశగా దూసుకెళ్లింది. ఆ బంతిని ఎంఎస్ ధోనీ యువ క్రికెటర్ తరహాలో డైవ్ చేసి మరి అందుకున్నాడు. పూర్తిగా గాల్లోకి ఎగిరి ధోనీ అందుకున్న తీరు అభిమానులను అమితంగా ఆకట్టుకుంటుంది. ఈ క్యాచ్‌ చూసి మైదానంలోని ఆటగాళ్లంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇక టీవీల్లో మ్యాచ్ చూసే అభిమానుల మతి పోయింది.

సూపర్ మ్యాన్ ఫ్లయింగ్ క్యాచ్

సూపర్ మ్యాన్ ఫ్లయింగ్ క్యాచ్

ఈ ఒక్క క్యాచ్‌తో 39 ఏళ్ల వయసులోనూ.. అది క్రికెట్‌కు ఏడాది గ్యాప్ వచ్చినా.. తనలోని కీపర్‌లో ఎలాంటి మార్పు రాలేదని టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నిరూపించాడు. ఈ క్యాచ్‌పై అభిమానులు కూడా తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'ఎంఎస్ ధోనీ బెస్ట్', '39 సంవత్సరాల సూపర్ మ్యాన్', 'సూపర్ మ్యాన్ ఫ్లయింగ్ క్యాచ్', 'కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు' అంటూ అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. తన అద్భుతమైన క్యాచ్‌తో మళ్లీ పాత ధోనీని గుర్తు చేశాడంటూ మరికొందరు సంబరపడుతున్నారు. ఇక పాత ధోనీలా బ్యాట్‌ ఝులిపించాలని వారు కోరుకుంటున్నారు.

ఓ పొరపాటు కూడా

రెండు అద్భుతాలు చేసిన ఎంఎస్ ధోనీ.. ఓ పొరపాటు కూడా చేశాడు. తొలి ఓవర్‌లోనే పృథ్వీ షా ఔటైనా.. ఔట్ కోసం మహీ అప్పీల్ చేయలేదు. దీపక్ చహర్ బౌలింగ్‌లో షా బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి నేరుగా ధోనీ చేతుల్లోకి వెళ్లి పడింది. కానీ సౌండ్ వినిపించకపోవడంతో ఔట్ కోసం ధోనీ అప్పీల్ చేయలేదు. అందరూ కామ్‌గానే ఉన్నారు. ఆ తర్వాత రిప్లైలో అసలు విషయం తెలిసింది.

ఉమేశూ.. బంగారం ధరల కన్నా నీ పరుగులే ఎక్కువగా ఉన్నాయి కదయ్యా!!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Saturday, September 26, 2020, 16:34 [IST]
Other articles published on Sep 26, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X